Motorola Edge 50 Ultra : అద్భుతమైన ఆఫర్.. ఈ మోటోరోలా అల్ట్రా ఫోన్ అతి చౌకైన ధరకే, ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Motorola Edge 50 Ultra : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ మోటోరోలా ఫోన్ కొనుగోలుపై రూ. 15వేలు డిస్కౌంట్ పొందవచ్చు.

1/7
Motorola Edge 50 Ultra : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త మోటోరోలా ఫోన్ భారీ తగ్గింపు ధరకు లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీపై డీల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. భారత మార్కెట్లో రూ.64,999కి లాంచ్ కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.15,000 తగ్గింపుతో లభిస్తోంది.
2/7
ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గాలంటే బ్యాంక్, కార్డ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీపై డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ డీల్ : భారత మార్కెట్లో ఈ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ ఫోన్ రూ.64,999 ధరతో వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.49,999కే లిస్ట్ అయింది. రూ.15వేలు నేరుగా తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.2,500 వరకు తగ్గింపు పొందవచ్చు.
4/7
పాత ఫోన్లు వాడే బదులు కొత్త ఫోన్ కొనేసుకోండి. మీ ఫోన్ బ్రాండ్, మోడల్‌ బట్టి రూ.39,850 వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈఎంఐ ఆప్షన్లు నెలకు రూ.1,758 నుంచి పొందవచ్చు.
5/7
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5జీ స్పెసిఫికేషన్లు : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.
6/7
6.7-అంగుళాల pOLED ప్యానెల్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 2,500 నిట్స్ టాప్ లెవల్ చేరుకుంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 4,500mAh బ్యాటరీ కూడా ఉంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా అందిస్తుంది.
7/7
కెమెరా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 64MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 50MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.