iPhone 17 Pro Discount : ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇలా కొంటే ఏకంగా రూ.17,900 తగ్గింపు.. నిమిషాల్లోనే డెలివరీ..!
iPhone 17 Pro Discount : బిగ్‌బాస్కెట్‌లో ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కూపన్ కోడ్‌తో రూ.17,910 వరకు ఆదా చేసుకోవచ్చు. రూ.1,16,990కే ఐఫోన్ 17 ప్రో కొనుగోలు చేయొచ్చు.. పూర్తి ఆఫర్ల వివరాలివే..
iPhone 17 Pro Discount
- ఐఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..
- బిగ్‌బాస్కెట్‌లో ఐఫోన్ 17 ప్రో భారీ ధర తగ్గింపు
- ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్‌పై అదిరిపోయే ఆఫర్లు
iPhone 17 Pro Discount : ఆపిల్ లవర్స్ మీకోసం అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఇంతకన్నా బెటర్ ఆఫర్ మళ్లీ రాదు.. ముఖ్యంగా ఐఫోన్ 17 ప్రో కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్.. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌లో ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రత్యేకంగా బ్యాంక్ కార్డులతో అవసరం లేకుండా కూపన్ కోడ్ ద్వారా అతి చౌకైన ధరకే ఈ ప్రీమియం ఫోన్‌ను ఇంటికి తెచ్చుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్ 17 ప్రో ధర ఎంతంటే? :
భారత్‌లో ఐఫోన్ 17 ప్రో అసలు ధర రూ.1,34,900గా ఉంది. అయితే, బిగ్‌బాస్కెట్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ రూ.1,24,990కే లభిస్తోంది. అంటే.. ప్రారంభ ధరపైనే రూ.9,910 తగ్గింపు పొందవచ్చు. దీనికి అదనంగా కాస్మిక్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌పై APPLE17PRO8000 అనే కూపన్ కోడ్ వాడితే మరో రూ.8వేలు తగ్గింపు పొందవచ్చు..
తద్వారా ఐఫోన్ ధర ఏకంగా రూ.1,16,990కు చేరుతుంది. అంటే.. మొత్తం రూ.17,910 ఆదా చేసుకోవచ్చన్నమాట. బేస్ ఐఫోన్ 17 ప్రోకు ఇదే అత్యల్ప ధరగా చెప్పొచ్చు..
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పైనా ఆఫర్ :
ప్రో మ్యాక్స్ కొనాలనుకునే వారికి కూడా బిగ్‌బాస్కెట్ అదిరే ఆఫర్ అందిస్తోంది. ఈ ఐఫోన్ కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ కలర్స్‌లో రూ.1,35,990కు లభిస్తోంది. దీనిపై APPLEE17M4000 లేదా AI17PROMAX4000 కూపన్ కోడ్ ఉపయోగిస్తే.. మరో రూ.4వేలు తగ్గుతుంది. దీంతో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.1,31,990కు తగ్గుతుంది.
నిమిషాల్లోనే డెలివరీ :
ఈ డీల్‌లో స్పీడ్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పిన్కోడ్లకు ఫోన్ నిమిషాల్లోనే డెలివరీ అయ్యే అవకాశం ఉంది. అయితే, స్టాక్, కలర్, ప్రాంతాన్ని బట్టి ఐఫోన్ లభించనుంది.
బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ అందుబాటులో లేకపోతే రిలయన్స్ డిజిటల్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఆఫర్లు కూడా చెక్ చేయొచ్చు.. ఐఫోన్ కొనాలనుకునే వారు ఆర్డర్ చేసే ముందు కూపన్ అప్లయ్, ఫైనల్ ధర, డెలివరీ వంటి పూర్తి వివరాలను చెక్ చేసుకోండి..
