Instagram AI Age Detection : ఇన్‌స్టాగ్రామ్‌లో ఏజ్ దాచేస్తున్నారా? ఇక మీ ఆటలు సాగవు.. టీనేజర్ల కోసం మెటా సరికొత్త AI నిఘా!
Instagram AI Age Detection : ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్లు ఫేక్ ఏజ్‌తో అకౌంట్లు క్రియేట్ చేయకుండా మెటా కొత్త AI టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. టీన్ అకౌంట్ ప్రొటెక్షన్స్, పిల్లల ఆన్లైన్ భద్రత, తల్లిదండ్రులు ఏం తెలుసుకోవాలో చూద్దాం..
Instagram AI Age Detection
- టీనేజర్లపై మెటా ఫోకస్.. ప్రపంచవ్యాప్తంగా AI వయసు గుర్తింపు టెక్నాలజీ
- పిల్లల భద్రత కోసం మెటా కీలక నిర్ణయం.. ఇక ఫేక్ బర్త్‌డేలకు చెక్
- ఇన్‌స్టాగ్రామ్‌లో వయసు మార్చి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? జాగ్రత్త..
Instagram AI Age Detection : ఇన్స్టాగ్రామ్ యూజర్లు జర జాగ్రత్త.. మీ వయస్సు దాచిపెడుతున్నారా? ఇకపై మీ ఆటలు సాగవు.. టీనేజర్ల కోసం మెటా సరికొత్త ఏఐ నిఘా ఫీచర్ తీసుకువస్తోంది.. చాలామంది సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు చెబుతుంటారు.
ముఖ్యంగా టీనేజర్లు తమ వయసును 18 ఏళ్లకు పైగా చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు.. దీంతో వారికి కనిపించే కంటెంట్, వచ్చే మెసేజ్‌లు కొన్నిసార్లు ఇబ్బందులకు కారణమవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేక్ ఏజ్ చెప్పినా ఇట్టే కనిపెట్టేలా ఏఐ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది..
అసలు కొత్త టెక్నాలజీ ఏంటీ ? :
ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు ఇచ్చే పుట్టిన తేదీ ఆధారంగానే వయసును లెక్కలోకి తీసుకునేవారు. కానీ, ఇకపై అలా కాదు. ఒక అకౌంట్ టీనేజర్ది అయ్యే అవకాశం ఉందని ఏఐ గుర్తిస్తే.. ఆ అకౌంట్ వివరాల్లో పెద్దవారిగా వయసు చూపించినా టీన్ అకౌంట్ ప్రొటెక్షన్స్ అమలు చేస్తుంది. 13 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారికి తగిన భద్రత కల్పించడమే ముఖ్య ఉద్దేశం..
టీన్ అకౌంట్లలో ఎలాంటి రక్షణ? :
టీనేజర్లకు అనవసరమైన మెసేజ్‌లు రాకుండా పరిమితులు, వయసుకు తగిన కంటెంట్ సూచనలు, స్క్రీన్ టైమ్ కంట్రోలింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే 13 ఏళ్లలోపు పిల్లలు ప్లాట్ఫామ్లలోకి రాకుండా అడ్డుకోవడంపైనా మెటా ఫోకస్ పెట్టింది..
తల్లిదండ్రులకూ అలర్ట్ :
అమెరికాలోని తల్లిదండ్రులకు ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌లో ప్రత్యేక వీడియో చూపించనుంది. పిల్లల వయసును ఎలా గుర్తిస్తారు? వారి ఆన్లైన్ సేఫ్టీ పేరెంట్స్ ఏం చేయాలి? అనే విషయాలను ఇందులో వివరిస్తారు. ఇదే తరహా ప్రొటెక్షన్, ఫేస్బుక్, థ్రెడ్స్‌లోనూ అమలు చేయాలని మెటా భావిస్తోంది..
సోషల్ మీడియాలో మీ వయస్సు దాచిపెట్టి అకౌంట్లు వాడే రోజులకు ఇకపై చెక్ పడనుంది. పిల్లల ఆన్లైన్ సేఫ్టీపై టెక్ కంపెనీలు మరింత దృష్టి పెడుతున్నాయనడానికి ఇది మరో ఉదాహరణగా చెప్పొచ్చు..
