Cancer Medicine Price Cut : కేంద్రం సంచలన నిర్ణయం.. రూ.40 వేల క్యాన్సర్ మందులు ఇక రూ.2,720కే.. రోగులకు భారీ ఊరట!
Cancer Medicine Price Cut : క్యాన్సర్ బాధితులకు భారీ శుభవార్త.. ప్రాణాలు బలిగొనే క్యాన్సర్ చికిత్సకు సంబంధించి మందుల ధరలు భారీగా దిగొచ్చాయి.. 679 బ్రాండ్ల ధరలు ఏకంగా 96 శాతం వరకు తగ్గాయి..
Cancer Medicine Price Cut
- క్యాన్సర్ పేషెంట్లకు గుడ్ న్యూస్..
- క్యాన్సర్ మందుల ధరలు దొగొచ్చాయ్
- వేల రూపాయల భారం తగ్గించిన కేంద్రం
- 679 బ్రాండ్ల ధరలు భారీగా డౌన్
Cancer Medicine Price Cut : క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 137 రకాల మందులపై వ్యాపార మార్జిన్లను 30 శాతానికి పరిమితం చేయడంతో 679 బ్రాండ్ల ధరలు భారీగా తగ్గాయి. కొన్ని మందుల ధరలు ఏకంగా 96 శాతం వరకు దిగివచ్చాయి.
క్యాన్సర్ పేరు వినగానే రోగులకు, వారి కుటుంబ సభ్యులకు గుర్తొచ్చేది ప్రాణభయం మాత్రమే కాదు.. చికిత్స కోసం అయ్యే లక్షల రూపాయల ఖర్చు కూడా.. మందులు కొనాలంటేనే జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి..
96శాతం వరకు తగ్గిన మందుల ధరలు :
ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ బాధితులకు భారీ ఊరటనిచ్చేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ఖరీదైన క్యాన్సర్ మందుల ధరలకు కళ్లెం వేస్తూ కీలక మార్పులు తీసుకొచ్చింది. దీంతో కొన్ని క్యాన్సర్ మందుల ధరలు ఏకంగా 96 శాతం వరకు తగ్గాయి..
జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) 137 రకాల క్యాన్సర్ మందులపై వ్యాపార మార్జిన్లను 30 శాతానికి పరిమితం చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి రావడంతో మార్కెట్లో పలు బ్రాండ్ల ధరలు భారీగా దిగివచ్చాయి. ఇప్పటికే 85 ఔషధ కంపెనీలు 121 మందులకు సంబంధించిన 1,364 ఫార్ములేషన్ల కొత్త ధరలను ప్రకటించాయి. ఇందులో 679 బ్రాండ్ల ధరలు 50 శాతానికి పైగా తగ్గడం విశేషం..
Read Also : Karthika Masam 2026 : కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో వచ్చే పండుగలు, పుణ్య తిథులేంటి? ఏ రోజు ఏ పూజ చేయాలంటే?
రూ.2,720కే క్యాన్సర్ మందులు :
ధరల తగ్గింపు ఎంత భారీగా ఉందో కొన్ని మందుల ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది.. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పాల్బోసిక్లబ్ క్యాప్సూల్స్ ప్యాక్ ధర గతంలో రూ.40,421 ఉండగా.. ఇప్పుడు రూ.2,720కే అందుబాటులోకి వచ్చింది.
ప్రోస్టేట్ క్యాన్సర్ మెడిషన్ అబిరాటెరోన్ ధర కూడా రూ.41,250 నుంచి రూ.3,218కి తగ్గింది. ఇతర క్యాన్సర్ మందుల ధరలు కూడా గణనీయంగా దిగివచ్చాయి. ఈ మార్పుతో దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ఏడాదికి సుమారు రూ.3,540 కోట్ల వరకు ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
పాత స్టాక్ కూడా కొత్త ధరలకే.. :
అయితే ధరలు తగ్గాయని మందుల సరఫరా తగ్గించకూడదని, కృత్రిమ కొరత సృష్టించకూడదని కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పాత స్టాక్‌ను కూడా కొత్త ధరలకే విక్రయించాలని మెడికల్ షాపులకు సూచించింది..
మందులను ఎక్కువ ధరకు అమ్మితే ఫార్మా సహీ దామ్ యాప్ లేదా NPPA వెబ్సైట్లో ధరలు చెక్ చేసుకోవచ్చు.. అధిక ధరలు వసూలు చేస్తే.. 1800-111-255 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కష్టకాలంలో ఉన్న క్యాన్సర్ బాధిత కుటుంబాలకు ఈ నిర్ణయం నిజంగా పెద్ద ఊరట అనే చెప్పాలి..
