Karthika Masam 2026 : కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలలో వచ్చే పండుగలు, పుణ్య తిథులేంటి? ఏ రోజు ఏ పూజ చేయాలంటే?
Karthika Masam 2026 : కార్తీక మాసం 2026 నవంబర్ 10 నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 8 వరకు వచ్చే నాగుల చవితి, కార్తీక పౌర్ణమి, ఏకాదశి, మాస శివరాత్రి సహా ముఖ్యమైన పండుగలు, పుణ్య తిథుల పూర్తి వివరాలివే..
Karthika Masam 2026 Begins
- నేటి నుంచే కార్తీక మాసం షురూ..
- నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు ముఖ్యమైన పండుగలు
- శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసం
- కార్తీక మాసంలో ఈ పండుగలు చాలా ప్రత్యేకం
Karthika Masam 2026 : కార్తీక మాసం వచ్చేసింది.. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. ఏడాది పొడవునా ఎన్ని పండుగలు వచ్చినా.. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఇళ్లలో ఆధ్యాత్మిక సందడి కనిపిస్తుంటుంది..
తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాలు చేయడం, ఇంటి ముందు దీపాలు వెలిగించడం, తులసి కోట దగ్గర పూజలు చేయడం, శివాలయాలకు వెళ్లడం కనిపిస్తుంది. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర మాసం 2026 నవంబర్ 10, మంగళవారం నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 8న కార్తీక అమావాస్యతో ముగియనుంది..
కార్తీక మాసం అంటే కేవలం పూజలు, వ్రతాలే కాదు.. కుటుంబంతో కలిసి భక్తిశ్రద్ధలతో సమయం గడపొచ్చు.. ఈ నెలలో దీపారాధన, తులసీ పూజ, శివాభిషేకం, ఉపవాసాలు, దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం, శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం చాలా విశేషంగా చెప్పొచ్చు..
కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు, పుణ్య తిథులేంటో తెలుసా?
నవంబర్ 10: కార్తీక శుద్ధ పాడ్యమి, బలి పాడ్యమి, ఆకాశదీపారంభం
నవంబర్ 11: యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం
నవంబర్ 13: నాగుల చవితి
నవంబర్ 15: తిరుమల శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం
నవంబర్ 16: కోటి సోమవారం
నవంబర్ 17: వృశ్చిక సంక్రమణం
నవంబర్ 19: యాజ్ఞవల్క జయంతి
నవంబర్ 20: ప్రబోధన ఏకాదశి
నవంబర్ 21: క్షీరాబ్ది ద్వాదశి, కైశిక ద్వాదశి
నవంబర్ 22: పక్ష ప్రదోషం
నవంబర్ 24: కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం, కృత్తికా దీపోత్సవం
నవంబర్ 27: సంకష్టహర చతుర్థి
డిసెంబర్ 4: కార్తీక బహుళ ఏకాదశి
డిసెంబర్ 6: పక్ష ప్రదోషం
డిసెంబర్ 7: మాస శివరాత్రి
డిసెంబర్ 8: కార్తీక అమావాస్య
ఈ మాసంలో ప్రతిరోజూ వీలైనంత వరకు దీపం వెలిగించడం, శివనామ స్మరణ చేయడం, తులసి పూజ, దానధర్మాలు చేయడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. భక్తితో చేసే చిన్నపాటి పూజకైనా ఎంతో విలువ ఉంటుందని విశ్వసిస్తారు. మరి ఈ కార్తీక మాసంలో మీ ఇంట్లోనూ దీపాల వెలుగులు నింపుకుని, శివకేశవుల ఆశీస్సులు పొందండి..
