Motorola Razr Fold : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఈ ఖరీదైన మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఎంతంటే?
Motorola Razr Fold : మోటోరోలా రేజర్ ఫోల్డ్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ అందిస్తోంది. బ్యాంక్ కార్డులు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో రూ.19వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ధర, ఫీచర్లు, పూర్తి ఆఫర్ల వివరాలివే..
Motorola Razr Fold Price
- రూ.19 వేల వరకు తగ్గింపు.. మోటోరోలా రేజర్ ఫోల్డ్ పై అదిరిపోయే ఆఫర్
- లక్షన్నర ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఎంత తగ్గిందంటే?
- మడతపెట్టే ఫోన్‌పై భారీ ఆఫర్.. రూ.1.30 లక్షలకే మీ సొంతం
Motorola Razr Fold : ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే కెమెరా, భారీ బ్యాటరీతో మంచి ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. మోటోరోలా రీసెంట్ బుక్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా రేజర్ ఫోల్డ్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. దాదాపు రూ.1.50 లక్షల ధర ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మోటోరోలా రేజర్ ఫోల్డ్ ధర.. ఆఫర్లు :
భారత్‌లో మోటోరోలా రేజర్ ఫోల్డ్ ప్రారంభ ధర రూ.1,49,999కు లభిస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ మోటోరోలా ఫోన్ రూ.1,44,999కే లిస్ట్ అయింది. అంటే నేరుగా రూ.5వేలు తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా ఫ్లిప్ కార్ట్ యాక్సస్ బ్యాంకు లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే రూ.14వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Vivo X300 FE Discount : రూ.10 వేలకుపైగా తగ్గింపు.. 6500mAh బ్యాటరీతో వివో X300 FE అదిరిపోయే డీల్!
HDFC, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కూడా రూ.10వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరింత ఆదా చేసుకోవచ్చు. ఇలా అన్ని ఆఫర్లు కలిపి గరిష్ఠంగా రూ.19వేల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అయితే, బ్యాంక్ ఆఫర్లకు సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయి..
ఫీచర్లు అదుర్స్ :
ఈ ఫోన్లో 8.1 అంగుళాల 2K ఎల్టీపీఓ pOLED మెయిన్ డిస్ప్లే అందించారు. 6.6 అంగుళాల కవర్ డిస్ప్లే కూడా ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో ఈ ఫోన్లో 6,000mAh బ్యాటరీ అందించారు. 80W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఇంటర్నల్ కెమెరా అందించారు..
ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. అయితే కొనుగోలు చేసే ముందు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ వాల్యూ, ఫైనల్ ధరను ఒకసారి చెక్ చేసుకోండి..
