IND vs NZ : మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్.. కివీస్ బ్యాటింగ్
IND vs NZ : హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది.
IND vs NZ 3rd ODI Team India have won the toss and have opted to field
IND vs NZ : హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. వాతావరణం మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. గతంలో చేసిన మంచి ప్రదర్శనలనే మళ్లీ కొనసాగిస్తాం. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు.’ అని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు.
🚨 Toss 🚨
#TeamIndia have won the toss and elected to bowl in the 3️⃣rd ODI.
Updates ▶️ https://t.co/P4Pwt4M0t7
#NZvIND https://t.co/lJ9QRMIw7b
— BCCI (@BCCI) November 10, 2026
‘నిన్న మాకు మంచి శిక్షణ లభించింది. పిచ్ కొంతకాలంగా కప్పి ఉంచబడింది. కాబట్టి ఇది బౌలర్లకు కొంత సహకరించే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఈ పిచ్‌పై 180 పరుగులు మంచి స్కోరుగా ఉండేదేమో. ఈరోజు పరిస్థితిని బట్టి మేము అంచనా వేసుకోవాలి. తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. టిక్నర్ స్థానంలో ఫిషర్ వచ్చాడు.’ అని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు.
న్యూజిలాండ్ తుది జట్టు..
విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జామీసన్, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.
An unchanged Playing XI for #TeamIndia in Hamilton 📝
Updates ▶️ https://t.co/P4Pwt4M0t7
#NZvIND https://t.co/B8l4t2908y
— BCCI (@BCCI) November 10, 2026
