Vrushakarma: నాగ చైతన్య-కార్తీక్ వర్మ బాక్సాఫీస్ టార్గెట్.. ‘వృషకర్మ’ బిజినెస్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్!
నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ ధరకు అమ్ముడైన వృషకర్మ(Vrushakarma) మూవీ ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ రైట్స్.
naga chaitanya vrushakarma movie pre release business details
- వృషకర్మ సినిమాకు భారీ డిమాండ్
- ప్రీ రిలీజ్ బిజినెస్ లో చై కెరీర్ లోనే హైయ్యెస్ట్
- పాజిటీవ్ టాక్ వస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ
Vrushakarma: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల తండేల్ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన నాగ చైతన్య ఇప్పుడు తన కెరీర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న భారీ సినిమా ‘వృషకర్మ’. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ నుండే ట్రేడ్ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో నాగచైతన్య సరసన బ్లాక్ బస్టర్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.
బీవీఎస్యెన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారు మేకర్స్. పీరియాడికల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట. ఇటీవలే విడుదలైన వృషాకర్మ టీజర్ ఆడియన్స్ లో అంచనాలను పెంచేసింది. ఇందులో భాగంగానే బిజినెస్ పరంగా కూడా నాగచైతన్య కెరీర్లో ముందెన్నడూ చూడని రికార్డులను సృష్టిస్తోంది ఈ సినిమా.
తాజా సమాచారం ప్రకారం, ‘వృషకర్మ(Vrushakarma)’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ సుమారు రూ.45 కోట్ల రూపాయల భారీ మొత్తానికి దక్కించుకున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ ఏకంగా రూ.8 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. నాగచైతన్య సినీ ప్రస్థానంలోనే ఇది హయ్యెస్ట్ ఓవర్సీస్ బిజినెస్ కావడం విశేషం.
అయితే, సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకమే ఈ రేంజ్ బిజినెస్‌కు కారణమని వర్గాలు అంచనా వేస్తున్నాయి ట్రేడ్. విరూపాక్ష తరహాలోనే దర్శకుడు కార్తీక్ వర్మ మరోసారి విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో అటు బయ్యర్లలోనూ, ఇటు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే, బాక్సాఫీస్ వద్ద నాగచైతన్య కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ నమోదు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ‘వృషకర్మ’ సినిమా చైతూను కమర్షియల్‌గా మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.
