Gold Price Today : బంగారం ధర ఢమాల్.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గుదల.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Price Today : బంగారం ధర మళ్లీ తగ్గింది. వరుసగా రెండోరోజు భారీగా తగ్గింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్ రేటు తగ్గింది. వరుసగా రెండో రోజు భారీగా తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ఇరాన్ -అమెరిక ఉద్రిక్తతలు) ఉన్నప్పటికీ డాలర్ ఇండెక్స్ పెరగడం వల్ల ముదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో బంగారం, వెండి ధరలు భారతదేశంలో తగ్గుముఖం పట్టాయి.

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 980 తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 900 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 25డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 5,105 డాలర్ల వద్ద కొనసాగుతుంది.

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వెండి రేటు స్థిరంగా కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,240కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,47,800 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,390 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,47,930 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,61,240కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,47,800 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,62,560 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,49,000 వద్దకు చేరింది.

వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,80,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,90,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
