Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చెయ్.. సీఎం యోగికి అఖిలేష్ యాదవ్ సవాల్.. యూపీలో వేడెక్కిన రాజకీయం!
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Akhilesh Yadav)లపై విమర్శల బాణాలు గుప్పించారు
Akhilesh Yadav open challenges Yogi Adityanath for the 2027 UP Assembly elections.
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రీయ రాజకీయం ఒక్కసారిగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో వేడెక్కింది. మళ్లీ అయోధ్య అంశమే ప్రధాన రాజకీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ అయోధ్యలో రెండు రోజుల పాటు పర్యటించి, బీజేపీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై విమర్శల బాణాలు గుప్పించారు. అయోధ్య స్థానంలో పోటీ చేసేందుకు బీజేపీకి సరైన అభ్యర్థి కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం యోగికి నిజంగా ధైర్యం, నమ్మకం ఉంటే అయోధ్య నుంచే స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసి నిలబడాలని బహిరంగ సవాల్ విసిరారు.
Cm Chandrababu: ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ.. గోదావరి పుష్కరాలపై చర్చ.. నిధుల కోసం విజ్ఞప్తి!
ఆధ్యాత్మిక వేదికపై రాజకీయ శంఖారావం.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి భావజాలం ప్రస్తావన:
అయోధ్యలో నిర్వహించిన భాగవత కథ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్(Akhilesh Yadav), ఆధ్యాత్మిక అంశాలను రాజకీయాలకు ముడిపెడుతూ మాట్లాడారు. అధికారం, కులం, తారతమ్యాలు, అంటరానితనం వంటి సామాజిక వివక్షల నుంచి బయటపడటమే భాగవతం బోధించే అసలైన సందేశమని పేర్కొన్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుని జీవన విధానాన్ని ఉదాహరణగా చూపుతూ, ప్రేమ, మానవత్వమే పరిపాలనకు ప్రాథమిక అర్హతలని స్పష్టం చేశారు. ఈసారి అయోధ్య ప్రజలే మంచికి, చెడుకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా తేలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్పీ వ్యూహాత్మక పావులు.. అభ్యర్థి ప్రకటనతో పాటు భారీ సంక్షేమ హామీలు:
2027 ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో అఖిలేష్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే అయోధ్య శాసనసభ నియోజకవర్గానికి తేజ్ నారాయణ్ పాండేను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ఏడాదికి రూ. 40 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా పేదల ఇళ్లు, దుకాణాల కూల్చివేతలను పూర్తిగా నిలిపివేసి, అయోధ్యకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా సమగ్రాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
