Gold-Silver Prices Today : బంగారం ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
Gold-Silver Prices Today : గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

Gold-Silver Prices Today : వరుస పండుగల వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా. అయితే, మీకు శుభవార్త. గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోంది.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 23 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 4,135 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,49,570 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,37,100 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,700 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,37,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,570కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,37,100 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
