iQOO Z12S Launch : ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్.. 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్ వస్తోంది.. ఎప్పుడంటే?
iQOO Z12S Launch : 10,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో iQOO Z12S స్మార్ట్‌ఫోన్ రానున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఈ కొత్త మిడ్‌రేంజ్ ఫోన్ లాంచ్ ఎప్పుడు? ఫీచర్లు ఏంటి?
iQOO Z12S Launch
- 7 అంగుళాల స్క్రీన్.. భారీ బ్యాటరీ అదుర్స్
- ఐక్యూ కొత్త Z12S ఫోన్ ఫీచర్లు లీక్
- రోజులు గడిచినా ఛార్జింగ్ అవసరం ఉండదు
iQOO Z12S Launch : కొత్త ఐక్యూ ఫోన్ వచ్చేస్తోంది.. మంచి బ్యాటరీ బ్యాకప్ ఫోన్ కోసం చూస్తున్నారా? రోజంతా ఫోన్ వాడినా ఛార్జింగ్ అందించే ఫోన్ అతి త్వరలో రాబోతుంది.. ఐక్యూ కంపెనీ సరికొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 10,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఐక్యూ ఫోన్ ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
ఐక్యూ జెడ్12ఎస్ పేరుతో కొత్త ఫోన్? :
లేటెస్ట్ లీకుల ప్రకారం.. ఐక్యూ జెడ్12 సిరీస్‌లో మరో కొత్త ఫోన్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.. ఈ ఐక్యూ ఫోన్ Z12S పేరుతో మార్కెట్లోకి రావచ్చని అంచనా..
Read Also : Vivo Y6k Launch : రూ. 22 వేలకే Vivo కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీ..!
బ్యాటరీ, డిస్ప్లేనే హైలెట్.. :
ఈ ఫోన్లో 10,000mAh భారీ బ్యాటరీ ఉండొచ్చు.. అంతేకాదు, ఏకంగా 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానుంది. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వంటి టాస్కులకు భారీ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు..
లాంచ్ ఎప్పుడంటే? :
ఈ స్మార్ట్‌ఫోన్ 2027 రెండో త్రైమాసికంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. భారీ బ్యాటరీ, పెద్ద స్క్రీన్‌తో రానుంది.. ఈ ఐక్యూ ఫోన్ ధర, ప్రాసెసర్, కెమెరా, ఛార్జింగ్ స్పీడ్ వంటి వివరాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి..
