Daniel Vettori : అందుకనే పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేశాము.. లేదంటేనా.. డానియల్ వెటోరీ హాట్ కామెంట్స్..
పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం పై సన్‌రైజర్స్ ప్రధాన కోచ్ డానియల్ వెటోరీ (Daniel Vettori ) స్పందించాడు.
Sunrisers head coach Daniel Vettori opened up about buy Abrar Ahmed
- ది హండ్రెడ్ లీగ్‌లో పాక్ స్పిన్నర్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
- అబ్రార్ అహ్మద్‌ను దక్కించుకోవడంపై డానియల్ వెటోరీ కామెంట్స్
- మాకు మరో ఆప్షన్ లేకపోయింది..
Daniel Vettori : లండన్‌లోని పికాడిల్లీ లైట్స్‌లో జరిగిన ది హండ్రెడ్ 2026 వేలంలో పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేసింది. అతడి కోసం ఏకంగా రూ.2.34 కోట్లు (190,000 పౌండ్లు) వెచ్చించింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ యాజమాన్యం, కావ్యమారన్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదిలాఉంటే.. ది హండ్రెడ్ టోర్నీలో భారత యాజమాన్యంలోని ఫ్రాంఛైజీతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి పాకిస్థాన్ ఆటగాడిగా అబ్రార్ నిలిచాడు.
వేలంలో సన్‌రైజర్స్ సీఈవో కావ్య మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెటోరీ లు పాల్గొన్నారు. అబ్రార్ ను కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ .. ట్రెంట్ రాకెట్స్ తో బిడ్డింగ్‌లో పోటీపడింది. దీంతో అబ్రార్ ధర పెరిగిపోయింది.
ఇక వేలం అనంతరం అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం పై సన్‌రైజర్స్ ప్రధాన కోచ్ డానియల్ వెటోరీ మాట్లాడాడు. పాక్ ఆటగాళ్లను తీసుకోవాలా వద్దా అనే అంశం పై ఫ్రాంఛైజీలో ఎలాంటి చర్చ జరగలేదన్నాడు. అందుబాటులో ఉన్న వారిలో నాణ్యమైన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయాలని భావించామన్నాడు.
‘మాకు ఓ అత్యుత్తమ స్పిన్నర్ అవసరం ఉంది. వేలంలో అందుబాటులో ఉన్న వారిలో అబ్రార్ అహ్మద్ మాకు మంచి ఆప్షన్‌గా కనిపించాడు. ఆదిల్ రషీద్ మిస్ కావడంతో మా ప్రాధాన్యత అంతా విదేశీ స్పిన్నర్‌పైనే ఉంది. అబ్రార్‌ను దక్కించుకోవడం ఆనందంగా ఉంది.’ అని వెటోరి అన్నాడు.
ఇంగ్లాండ్ వేదికగా జూలై 21 నుంచి ఆగస్టు 16 వరకు ది హండ్రెడ్ 2026 జరగనుంది.
