Gold Rate Today: పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినప్పటికీ.. దేశీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై 50శాతం సుంకాలు విధించి వాణిజ్య అనిశ్చితికి తెరలేపారు. దీంతో బంగారం సురక్షితమైన మార్గంగా పెట్టుబడిదారులు ఇన్వెస్టమెంట్లను మళ్లించారు. అలాగే దేశీయంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో గిరాకీ పెరిగి ధరలు భారీగా పెరిగాయి. అయితే, ఒక్కరోజులో సీన్ రివర్స్ అయింది. పసిడి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్‌పై 11 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,398 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.16శాతం పెరిగి 38డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 10వ తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మార్కెట్లో బంగారం రేట్లు ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.94,450 చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,03,040కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,600కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,03,190కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.94,600 కాగా.. 24క్యారెట్ల ధర రూ.రూ.1,03,190కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,27,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,17,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,27,00 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.