ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటు రోజువారీ SMS బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది.

టెల్కో అనేక డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను కూడా ఆఫర్ చేస్తోంది.

ఎయిర్‌టెల్ యూజర్లు రోజువారీ డేటా లిమిట అయిపోయినప్పుడల్లా అదనపు డేటాను పొందవచ్చు.

యాడ్-ఆన్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయాలంటే మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వలె కాకుండా యూజర్లు బల్క్ డేటాను పొందవచ్చు. 

అవసరమైనప్పుడు మరింత డేటాను వినియోగించుకోవచ్చు. 

రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ బెనిఫిట్స్ మధ్య వ్యత్యాసాన్ని నెలవారీ రీఛార్జ్‌లపై 60GB వరకు బల్క్ డేటాను అందిస్తోంది. 

Airtel రూ. 489, రూ. 509తో రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను యాడ్ చేసింది. 

ఈ ప్లాన్ భారీ ఇంటర్నెట్ వినియోగించే యూజర్లకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. 

ఇప్పుడు 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని పొందిన యూజర్లకు నెలవారీ బల్క్ డేటాను అందిస్తుంది.