Airtel New Prepaid Plans : ఎయిర్‌టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. బల్క్ ఇంటర్నెట్ డేటా పొందవచ్చు..!

Airtel New Prepaid Plans : భారతి ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటు రోజువారీ SMS బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. టెల్కో అనేక డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను కూడా ఆఫర్ చేస్తోంది.

Airtel New Prepaid Plans : ఎయిర్‌టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. బల్క్ ఇంటర్నెట్ డేటా పొందవచ్చు..!

Airtel launches 2 new prepaid plans for users who browse social media all day, details here

Airtel New Prepaid Plans : భారతి ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటు రోజువారీ SMS బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. టెల్కో అనేక డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. తద్వారా ఎయిర్‌టెల్ యూజర్లు రోజువారీ డేటా లిమిట అయిపోయినప్పుడల్లా అదనపు డేటాను పొందవచ్చు. కానీ, యాడ్-ఆన్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేయాలంటే మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వలె కాకుండా యూజర్లు బల్క్ డేటాను పొందవచ్చు.

అవసరమైనప్పుడు మరింత డేటాను వినియోగించుకోవచ్చు. కానీ, టెల్కో ఇప్పుడు రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ బెనిఫిట్స్ మధ్య వ్యత్యాసాన్ని నెలవారీ రీఛార్జ్‌లపై 60GB వరకు బల్క్ డేటాను అందిస్తోంది. టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. Airtel రూ. 489, రూ. 509తో రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను యాడ్ చేసింది. ఈ ప్లాన్ భారీ ఇంటర్నెట్ వినియోగించే యూజర్లకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. ఇప్పుడు 5G నెట్‌వర్క్ కనెక్టివిటీని పొందిన యూజర్లకు నెలవారీ బల్క్ డేటాను అందిస్తుంది. డేటా, కాలింగ్, అదనపు బెనిఫిట్స్ అందించే కొత్త Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

Read Also : Airtel Free OTT Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ ప్లాన్లపై ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

బల్క్ ఇంటర్నెట్ డేటా పొందాలంటే? :
ఎయిర్‌టెల్ (Airtel) రూ. 489 ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కింద యూజర్లు 30 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ లోకల్ STD, రోమింగ్ కాల్‌లు, 300 SMS, 50 GB బల్క్ డేటాను పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ కోసం, ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్ ఫ్రీ, ఉచిత హలో ట్యూన్‌లు, అపోలో 24 బై 7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్‌లో క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ అందిస్తోంది.

Airtel launches 2 new prepaid plans for users who browse social media all day, details here

Airtel launches 2 new prepaid plans for users who browse social media all day

ఎయిర్‌టెల్ రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్: ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను నెలవారీ వాలిడిటీ ప్లాన్‌గా ప్రవేశపెట్టింది. వినియోగదారులు నెలలోని 28, 30 లేదా 31 రోజులతో సంబంధం లేకుండా మొత్తం 1 నెల పాటు ప్లాన్ వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్ లోకల్ లేదా STD కాల్స్‌పై అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 60GB బల్క్ డేటాను అందిస్తుంది.

అదనపు ప్రయోజనాలలో Wynk Music Free, Free Hellotunes, Apollo 24 by 7 Circle, FASTag ప్రయోజనాలపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రెండు ప్లాన్‌లు SMS బెనిఫిట్స్ కోసం నెలకు కేవలం 300 SMSలకు లిమిట్ అందిస్తుంది. కేవలం డేటా బెనిఫిట్స్‌తో పాటు కాలింగ్‌ని కోరుకునే యూజర్లకు రోజువారీ డేటా బెనిఫిట్స్ పొందలేరు. అయితే, వినియోగదారులు బల్క్ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు.

35కు పైగా నగరాల్లో Airtel 5G నెట్‌వర్క్ :
ఎయిర్‌టెల్ ఇటీవల తమిళనాడులోని 5 నగరాల్లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. కోయంబత్తూరు, మదురై, హోసూర్, త్రిచీలో నివసిస్తున్న వినియోగదారులు తమ ప్రాంతంలో నెట్‌వర్క్ లైవ్ తర్వాత 5G సర్వీసులను ఉచితంగా పొందవచ్చు. ఎయిర్‌టెల్ ముందుగా చెన్నైలో 5వ జనరేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీని ప్రారంభించింది.

Airtel 5G Plusగా పిలిచే ఈ నెట్‌వర్క్ ఇప్పటికే అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సహా 18 రాష్ట్రాలు, UTలోని 35 నగరాల్లో విస్తరించింది. కొత్తగా ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ను 2023 డిసెంబర్ నాటికి భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Oppo Reno 8T Launch : ఒప్పో నుంచి ప్రీమియం 5G ఫోన్ వస్తోంది.. ధర, ఫీచర్లు లీక్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?