Oppo Reno 8T Launch : ఒప్పో నుంచి ప్రీమియం 5G ఫోన్ వస్తోంది.. ధర, ఫీచర్లు లీక్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Oppo Reno 8T Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి ప్రీమియం 5G ఫోన్ త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ ప్రీమియం 5G ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. Oppo వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 8న ఫిలిప్పీన్స్‌లో లాంచ్ కానుంది.

Oppo Reno 8T Launch : ఒప్పో నుంచి ప్రీమియం 5G ఫోన్ వస్తోంది.. ధర, ఫీచర్లు లీక్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Oppo Reno 8T global launch date confirmed, tipped to launch in India too

Oppo Reno 8T Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి ప్రీమియం 5G ఫోన్ త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ ప్రీమియం 5G ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. Oppo వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 8న ఫిలిప్పీన్స్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Oppo Reno 8T భారత మార్కెట్లోకి కూడా తొలిసారిగా అందుబాటులోకి రానుంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ భారత మార్కెట్లో ఒప్పో ధర, రాబోయే Oppo ఫోన్ ఫొటోలను లీక్ చేశారు. ఈ డివైజ్ త్వరలో దేశానికి వస్తుందని తెలిపింది. ఫిబ్రవరి మొదటి వారంలో భారత్‌కు రానుందని సమాచారం. Oppo Reno 8T ధర రూ. 27వేల నుంచి రూ. 29వేల మధ్య ఉంటుంది. ఇదే జరిగితే, కొత్త Oppo ఫోన్ Redmi Note 12 Pro+, Realme 10 Proకి పోటీగా రానుంది.

Oppo Reno 8T ఫీచర్లను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. అయితే 5G ఫోన్ ఫీచర్లు మాత్రం లీక్‌ అయ్యాయి. Oppo ఫోన్ కొద్దిగా కర్వడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని, స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుందని లీకైన ఫొటోలు సూచిస్తున్నాయి. డివైజ్ బాడీ చాలా స్లిమ్‌గా కనిపిస్తోంది. వెనుక కెమెరా చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది.

Oppo Reno 8T global launch date confirmed, tipped to launch in India too

Oppo Reno 8T global launch date confirmed, tipped to launch in India

Read Also : Oppo Reno 8 Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఒప్పో రెనో 8 సిరీస్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

ముందు భాగంలో, సాధారణ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను చూడవచ్చు. కటౌట్ స్క్రీన్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉంటుంది. Oppo Reno 8T ఫోన్ ఎల్లో, బ్లాక్ సహా రెండు కలర్ ఆప్షనల్లో అందుబాటులో ఉంటుంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Oppo ఫోన్ హుడ్ కింద MediaTek Helio G99 ప్రాసెసర్‌తో రావచ్చు. ఎందుకంటే.. Oppo ఇంతకుముందు లో-పర్ఫార్మెన్స్ గల SoCలతో ప్రీమియం ఫోన్‌లను అందించింది.

120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టునిచ్చే సాధారణ 6.67-అంగుళాల డిస్‌ప్లేతో రావొచ్చు. కొత్త మిడ్-రేంజ్ ఫోన్‌లో కూడా ఒకటి ఉంటుందని భావిస్తున్నారు కెమెరాల విషయానికి వస్తే..108-MP ప్రధాన సెన్సార్, 2-MP కెమెరా, 2-MP సెన్సార్ ఉండవచ్చు. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 32-MP కెమెరాను చూడవచ్చు.

Oppo Reno 8T హుడ్ కింద సాధారణ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కంపెనీ వేగవంతమైన ఛార్జర్‌ను రిటైల్ బాక్స్‌లో అందిస్తుందని భావిస్తున్నారు. కొత్త Oppo ఫోన్ బాక్స్ వెలుపల సరికొత్త ఆండ్రాయిడ్ 13 OSతో రన్ అవుతుందని నివేదిక తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Oppo Reno 8T 5G : ఒప్పో రెనో 8T 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?