Jana Nayagan: దెబ్బ మీద దెబ్బ.. విజయ్ ‘జన నాయగన్’ మూవీకి మరో షాక్.. రూ.120 కోట్ల డీల్ క్యాన్సిల్?
జన నాయగన్(Jana Nayagan) సినిమా ఓటీటీ డీల్ రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్న అమెజాన్ ప్రైమ్.
amazon prime cancels jana nayagan movie ott deal
- విజయ్ సినిమాకు మరో దెబ్బ
- విడుదల జాప్యం వల్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్
- అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్’. గత కొన్ని నెలలుగా ఈ సినిమా చుట్టూ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సెన్సార్ కారణాల వల్ల సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే, తాజాగా ఈ సినిమాకు మరో షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Ustad Bhagat Singh: ‘కాలరే ఎత్తరా’ సాంగ్ వచ్చేసింది.. మాస్ డాన్స్ తో అదరగోట్టేసిన పవన్ కళ్యాణ్
జన నాయగన్(Jana Nayagan) సినిమా డిజిటల్ రైట్స్ ను సుమారు రూ. 120 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయాలనీ ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్ ప్రైమ్. కానీ, తాజా సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ ఈ భారీ డీల్ ను రద్దు చేసుకుందట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం. జన నాయగన్ విడుదలలో జాప్యంమేనట.
జన నాయగన్ సినిమా సెన్సార్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమాలో కొన్ని సీన్స్, డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని సూచించింది సెన్సార్. కానీ, ఈ విషయంలో కోర్టుకు వెళ్లారు మేకర్స్. ఇక అప్పటినుంచి జన నాయగన్ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేంతంగా ఉంది పరిస్థితి. అందుకే, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ డీల్ ను క్యాన్సిల్ చేసున్నట్టుగా తెలుస్తోంది. అయితే, నిర్మాణ సంస్థ నుండి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
