Oppo Reno 8 Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఒప్పో రెనో 8 సిరీస్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి రెనో 8 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఒప్పో 8 సిరీస్ రెండు వేరియంట్లలో వచ్చింది.

Oppo Reno 8 Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఒప్పో రెనో 8 సిరీస్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Oppo Reno 8, 8 Pro With 80w Fast Charging, 32mp Front Camera Launched In India

Oppo Reno 8 Series : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి రెనో 8 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఒప్పో 8 సిరీస్ రెండు వేరియంట్లలో వచ్చింది. Oppo Reno 8, Oppo Reno 8 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్లు. ఈ రెండు వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్లు ప్రత్యేకించి ఫోటోగ్రఫీపై దృష్టి సారించాయి. అయితే రెండింటి మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయి. ప్రో మోడల్ మారిసిలికాన్ X చిప్‌తో వస్తుంది. తక్కువ-కాంతి సెట్టింగ్‌లలో కూడా అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. అలాగే వీడియోలను క్వాలిటీగా తీసుకోవచ్చు. ఇందులోని కెమెరా విభాగాలు డ్యుయల్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తాయి. Android 12-ఆధారిత ColorOS 12.1తో రన్ అవుతాయి.

ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో ధర :
రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకే స్టోరేజ్ ఆప్షన్, రెండు కలర్ వేరియంట్‌లు ఉన్నాయి. Oppo Reno 8 సింగిల్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 29,999 ఉండగా.. రెనో 8 ప్రో మోడల్ సింగిల్ 12GB RAM, 256GB స్టోరేజ్ యూనిట్‌కు రూ. 45,999 ధర ఉంటుంది. సాధారణ ఆప్షన్లలో షిమ్మర్ గోల్డ్, షిమ్మర్ బ్లాక్ కలర్స్ మధ్య ఎంచుకోవచ్చు. ప్రో మోడల్‌లో గ్లేజ్డ్ గ్రీన్, గ్లేజ్డ్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి. యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ డిజైన్ వెనుక కెమెరా మాడ్యూల్ ఆకర్షణీయంగా ఉంటుంది. భారత మార్కెట్లో Oppo Reno 8, Reno 8 Pro సేల్స్ వరుసగా జూలై 19, జూలై 25 మళ్లీ మొదలు కానుంది. ముందుగా వినియోగదారులు Oppo ఇండియా స్టోర్లలో లేదా ‌Flipkart నుంచి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో Oppo ప్యాడ్ ఎయిర్ అని పిలిచే మొదటి టాబ్లెట్‌ను కూడా లాంచ్ చేసింది. కంపెనీ Enco X2గా పిలిచే ప్రీమియం TWS ఇయర్‌బడ్‌లను కూడా లాంచ్ చేసింది.

Oppo Reno 8, 8 Pro With 80w Fast Charging, 32mp Front Camera Launched In India (1)

Oppo Reno 8, 8 Pro With 80w Fast Charging, 32mp Front Camera Launched In India 

ఒప్పో రెనో 8 ప్రో స్పెసిఫికేషన్స్ :
రెనో 8 ప్రో 6.7-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, Full-HD రిజల్యూషన్‌ను అందిస్తుంది. సింగిల్ 32-MP సోనీ IMX709 కెమెరా సెన్సార్‌తో డిస్‌ప్లే హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 8100-Max చిప్‌సెట్ నుంచి పవర్ అందిస్తుంది. OnePlus 10Rకి కూడా అదే పవర్ అందిస్తుంది. Android 12-ఆధారిత ColorOS 12.1పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు రెండు సంవత్సరాల Android అప్ డేట్స్ లభిస్తాయని కంపెనీ పేర్కొంది.

వీడియోలకు ఫేజ్ డిటెక్షన్ AF (PDAF)తో కూడిన 50-MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 8-MP వైడ్ యాంగిల్ సెన్సార్, 2-MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో AFతో 32-MP షూటర్ లభిస్తుంది. బోర్డ్‌లోని మారిసిలికాన్ X ఇమేజింగ్ NPU 6nm ప్రాసెస్ ద్వారా రాత్రిపూట కూడా పదునైన 4K వీడియోలను తీసుకోవచ్చు. ఇమేజింగ్ టెక్నాలజీ Find X 5 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో వచ్చింది. అలాగే 4,500mAh బ్యాటరీ, 5G, ఫేస్ అన్‌లాక్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, NFC వంటి ఇతర ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. 80W ఛార్జర్‌తో రెనో 8 ప్రో 11 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ అవుతుందని Oppo తెలిపింది.

ఒప్పో రెనో 8 స్పెసిఫికేషన్లు :
Reno 8, Reno 8 Pro కన్నా పెద్దగా తేడా లేదు. ప్లాస్టిక్ బిల్డ్‌ను కలిగి ఉంది. ప్రో మోడల్‌కు గ్లాస్ ఉంటుంది. స్క్రీన్ సైజు కూడా చాలా చిన్నది, 90Hz రిఫ్రెష్ రేట్, Full-HD రిజల్యూషన్ (2,400×1,080 పిక్సెల్‌లు)తో 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. MediaTek 1300 SoCతో వచ్చింది. OnePlus Nord 2T మాదిరిగానే ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్ సెన్సార్‌ను కలిగి ఉంది, OV02B10 2-MP సెన్సార్‌కు బదులుగా 2-MP GC02M1 మాక్రో సెన్సార్‌తో వచ్చింది. ముందు భాగంలో 32-MP ఫ్రంట్ సెన్సార్‌తో వచ్చింది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీని కూడా అందిస్తుంది.

Read Also : Oppo Pad Air Tablet : ఒప్పో నుంచి కొత్త టాబ్లెట్, వైరల్‌లెస్ ఇయర్‌బడ్స్.. ధర ఎంతంటే?