Aadarsha Kutumbam: వెంకీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక దుబాయ్ షెడ్యూల్ పైనే భారం
వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా ఆదర్శకుటుంబం(Aadarsha Kutumbam) విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది.
Venkatesh Aadarsha Kutumbam Movie Release Date Update
- రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆదర్శకుటుంబం
- గాంధీ జయంతికి రెడీ అవుతున్న మూవీ
- దుబాయ్ షెడ్యూల్ పైనే అనుమానం
Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (House No: 47)(Aadarsha Kutumbam). నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఒక చిన్న అడ్డంకిని ఎదుర్కొంటోంది. కథ ప్రకారం ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాలను దుబాయ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ షెడ్యూల్ సందిగ్ధంలో పడినట్లు సమాచారం.
Ariyana Glory: పవన్ కళ్యాణ్ మేనియా.. ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో అరియానా క్రేజీ ఫోటోలు
ఈ షెడ్యూల్ విషయంలో మేకర్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రస్తుతానికి వాయిదా వేయాలా? లేక దుబాయ్‌కు ప్రత్యామ్నాయంగా వేరే లొకేషన్ వెతకాలా? అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, యంగ్ హీరో నారా రోహిత్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ఈ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను నవ్వించబోతున్నారు.
ఇక వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో, త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఏ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఒకవేళ విదేశీ షెడ్యూల్ ఆలస్యమైతే విడుదల తేదీపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఏదేమైనా, వెంకీ-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ ‘ఆదర్శకుటుంబం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
