Ram Pothineni : రజినీకాంత్ కి రామ్ విలన్ ఏంట్రా బాబు.. అది కూడా..
రజినీకాంత్ హీరోగా ధర్మాన్ అనే సినిమా తెరకెక్కుతుంది. (Ram Pothineni)
Ram Pothineni
Ram Pothineni : రామ్ పోతినేని ఇటీవల దర్శకుడిగా మారి తనే హీరోగా నటిస్తూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది. హీరోగా తన కెరీర్ ని గాడిలో పెట్టుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు రామ్ పోతినేని. అయితే తాజాగా రామ్ విలన్ గా నటిస్తున్నాడని, అది కూడా రజినీకాంత్ సినిమాలో అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రజినీకాంత్ హీరోగా ధర్మాన్ అనే సినిమా తెరకెక్కుతుంది. కమల్ హాసన్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సిమ్రాన్, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే తమిళ మీడియా తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ నెగిటివ్ షేడ్స్ లో విలన్ గా నటిస్తున్నాడని, అది కూడా రజినీకాంత్ కి అల్లుడి పాత్రలో కనిపిస్తాడని, రామ్-రాశిఖన్నా జంటగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.
Also Read : Brahmanandam Brother : నన్ను పట్టించుకోవట్లేదు.. పలకరించట్లేదు.. బ్రహ్మానందంపై సొంత అన్న సంచలన కామెంట్స్..
దీంతో టాలీవుడ్ లో కూడా ఈ వార్త చర్చగా మారింది. అసలు హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటున్న రామ్ రజినీకాంత్ సినిమాలో విలన్ గా చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారు. ఒకవేళ చేసినా రజినీకాంత్ పవర్, స్టైల్, స్టామినా ముందు రామ్ సరిపోతాడా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొన్నాళ్ళు ఎదురుచూడాల్సిందే.
