iQOO Z11 Launch : ఐక్యూ ఫ్యాన్స్ రెడీనా.. కొత్త ఐక్యూ Z11 ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..
iQOO Z11 Launch : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ 5,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ సపోర్టు ఇస్తుంది. పూర్తి వివరాలివే..
iQOO Z11 Launch
- మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్
- ఐక్యూ జెడ్11 7,050mAh బ్లూవోల్ట్ బ్యాటరీతో రన్
- ఆగష్టు 20న భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 లాంచ్
iQOO Z11 Launch : ఐక్యూ ఫ్యాన్స్ గెట్ రెడీ.. వివో సబ్-బ్రాండ్ ఐక్యూ నుంచి త్వరలో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. అంతేకాదు.. ఐక్యూ బడ్స్ కూడా రిలీజ్ కానుంది. ఈ కంపెనీ రాబోయే ఐక్యూ జెడ్11 ఫోన్ కీలక స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అమెజాన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం మైక్రోసైట్ కూడా రెడీ అయింది.
ఐక్యూ జెడ్11 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఐక్యూ జెడ్11 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్సెట్తో రన్ అవుతుంది. ఈ చిప్సెట్తో దేశంలో లాంచ్ కాబోయే ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ కానుంది.
ఈ నెల 20నే ఐక్యూ జెడ్11 లాంచ్ :
ఆగస్టు 20న భారత మార్కెట్లో ఐక్యూ జెడ్11 ఫోన్ లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐక్యూ జెడ్11లో 7,050mAh బ్లూవోల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 3 ఏళ్ల OS అప్గ్రేడ్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ అందుతాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 40వేల లోపు ఉంటుందని ఐక్యూ పేర్కొంది. ఈ ధర రేంజ్ విషయానికి వస్తే.. ఐక్యూ జెడ్11 మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో రెడ్మి టర్బో 5లకు గట్టిపోటీ ఇవ్వగలదు. ఐక్యూ జెడ్11లో 1.5K రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది.
ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ 5,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేలో ఐ-ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంటుంది. ఐక్యూ జెడ్11లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
ఈ ఏడాది మార్చిలో చైనాలో లాంచ్ కాగా ఐక్యూ Z11లో అడ్డంగా క్యాప్సల్ షేప్ బ్యాక్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనీస్ వేరియంట్లో రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్ ఉంది. ఐక్యూ జెడ్11లో కర్వడ్ బ్యాక్ ప్యానెల్ 3D కర్వ్డ్ డిస్ప్లే ఉంటాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ పైభాగంలో స్పీకర్ గ్రిల్ మైక్రోఫోన్ ఉంటాయి. పవర్ బటన్ వాల్యూమ్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మందం 7.99 మిమీ ఉంటుంది. బరువు సుమారుగా 199 గ్రాములు ఉంటుంది. ఐక్యూ జెడ్11 చైనీస్ వేరియంట్లో 165Hz వరకు రిఫ్రెష్ రేట్ HDR సపోర్ట్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది.
