Megaverse : అధికారికంగా ‘మెగావర్స్’ అనౌన్స్.. నెట్ ఫ్లిక్స్ లో మెగాస్టార్ షో.. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ కంప్లీట్..
ఈ షో త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. (Megaverse)
Megaverse
Megaverse : మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో ఒక షో వస్తుందని ఎప్పట్నించి వార్తలు వస్తున్నాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ షోని అధికారికంగా ప్రకటించింది. మెగావర్స్ అనే పేరుతో ఈ షో త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
చిరంజీవి హోస్ట్ గా, ఆయనకు సాన్నిహిత్యంగా ఉండే పలువురు సెలబ్రిటీలు గెస్ట్ గా ఈ షో సాగనుంది. చిరు కెరీర్, ఆయన సినిమాలు, జ్ఞాపకాలు, రాజకీయ జీవితం.. ఇలా పలు విషయాల గురించి ఈ షోలో చెప్పబోతున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీలు చిరంజీవితో తమకున్న అనుబంధాన్ని పంచుకోబోతున్నారు. ఈ షోని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించడం విశేషం.
Also Read : Vishwak Sen : తన సినిమాని చూడొద్దు అంటున్న విశ్వక్ సేన్.. ‘కల్ట్’ సినిమాకు వాళ్ళు దూరంగా ఉండండి అంటూ..
ఇప్పటికే ఈ షోకి సంబంధించి రెండు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. ఒక ఎపిసోడ్ కి లోకనాయకుడు కమల్ హాసన్ వచ్చారు. మరో ఎపిసోడ్ లో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న ముగ్గురు స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, సునీల్, సత్యలు వచ్చారని సమాచారం. ఇప్పటికే ఈ రెండు ఎపిసోడ్స్ పూర్తవగా మరికొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ జరగనున్నాయి.
దీంతో ఈ మెగావర్స్ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ షో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
