Konda Surekha : మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్.. కేటీఆర్‌కు క్షమాపణ..
Konda Surekha : మాజీ మంత్రి కొండా సురేఖ ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేశారు. కేటీఆర్ పై గతంలో ఆమె చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు.
Konda Surekha
Konda Surekha : మాజీ మంత్రి కొండా సురేఖ ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేశారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా కొండా సురేఖ వివరణ ఇచ్చారు. గతంలో కేటీఆర్ పై తాను చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని అన్నారు.
Also Read : Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ
కొండా సురేఖ ట్వీట్ ప్రకారం.. ‘‘బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.’’ అంటూ కొండా సురేఖ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. కేటీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ లను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో కొండా సురేఖ ఇచ్చిన ఈ వివరణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను.
అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.
ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది.
కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు.
నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.
— Konda Surekha (@iamkondasurekha) October 29, 2026
