Vishwak Sen : తన సినిమాని చూడొద్దు అంటున్న విశ్వక్ సేన్.. ‘కల్ట్’ సినిమాకు వాళ్ళు దూరంగా ఉండండి అంటూ..
రిలీజ్ ట్రైలర్ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Vishwak Sen)
Vishwak Sen
Vishwak Sen : విశ్వక్ సేన్ మెయిన్ లీడ్ లో నటిస్తూ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సినిమా కల్ట్. గోవా బ్యాక్ డ్రాప్ లో డ్రగ్స్, అక్కడ లోకల్స్ నాన్ లోకల్స్ ని మోసం చేసే సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. కల్ట్ సినిమా అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. వీక్ హార్టెడ్ పీపుల్, చిన్న పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండండి. ఇది ఒక వైల్డ్ సినిమా అని తెలిపాడు. అలాగే.. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్స్ సినిమా వాల్యూమ్ 6.7 పెట్టండి. ఆడియన్స్ మీకు వాల్యూమ్ తక్కువ అనిపిస్తే థియేటర్ వాళ్ళని వెళ్లి అడగండి. సౌండ్ ఈ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చాడు.
Also Read : Janhvi Kapoor : అతనితో జాన్వీ కపూర్ ప్రేమ నిజమే..? ఆ సమయంలో నా పక్కనే ఉన్నాడు.. తాజా కామెంట్స్ వైరల్..
రిలీజ్ ట్రైలర్ చూస్తే రక్తపాతం, యాక్షన్ సీక్వెన్స్, దారుణంగా చంపే సీన్స్ సినిమాలో ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. మొత్తానికి విశ్వక్ సేన్ A రేటెడ్ సినిమా తీసి ముందే తన సినిమాకు వీక్ హార్టెడ్ పీపుల్, చిన్న పిల్లలను రావొద్దు అని చెప్పడం గ్రేట్ అని అంటున్నారు.
