CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలతోపాటు వారందరికీ శుభవార్త..
CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు భారీ బొనాంజా ప్రకటించారు.
CM Vijay
CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు భారీ బొనాంజా ప్రకటించారు. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాలు అందించనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ వాహనంతో పాటు ప్రతి ఎమ్మెల్యేకు డ్రైవర్, ఇంధనం, కారు నిర్వహణ ఖర్చులకోసం ప్రతీనెలా రూ.75వేలు చొప్పున భత్యం ఇవ్వనున్నట్లు విజయ్ ప్రకటించారు. వీటితోపాటు మ్మెల్యేలకు సెక్రటరీలను కూడా ఇవ్వనున్నారు. వారి కోసం అదనంగా 25వేలు ఖర్చు చేయనున్నారు. సీఎం ప్రకటనను ఎమ్మెల్యేలు స్వాగతించారు.
Also Read : Pakistan Petrol Price : పాక్‌లో రాకెట్లా దూసుకెళ్తున్న రేట్లు.. లీటర్ డీజిల్ రూ.396.. లీటర్ పెట్రోల్..
నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఈ వాహనాలను ఉపయోగించుకోవచ్చునని సీఎం విజయ్ పేర్కొన్నారు. ప్రధానంగా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని, అంతేకాక.. పారదర్శక, అవినీతి రహిత పాలనకు దోహదపడుతుందని సీఎం విజయ్ పేర్కొన్నారు. ఓ మహిళా ఎమ్మెల్యే సీఎం విజయ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ అసెంబ్లీలో పాటపాడటం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద వార్షిక ఆరోగ్య బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. ఆదాయం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థ ఆవిన్ సేకరించే పాల ధరను పెంచుతున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. లీటరుకు రూ.38గా ఉన్న ధరను రూ.41కు పెంచుతున్నట్లు విజయ్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 3.16లక్షలకుపైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
