Greater Noida Tragedy: ప్రాణం తీసిన మ్యాగీ.. తల్లిదండ్రులతో సహా ముగ్గురు పిల్లల మృతి.. పోస్ట్మార్టం రిపోర్ట్పై ఉత్కంఠ!
ఉత్తరప్రదేశ్ నోయిడాలో(Greater Noida Tragedy) ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Greater noida family 5 dead after eating maggi tea police investigation
Greater Noida Tragedy: ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో తల్లిదండ్రులతో పాటు వారి ముగ్గురు అమాయక పిల్లలు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి (Greater Noida Tragedy)తరలించారు. పండుగ వాతావరణంలో ఇలాంటి విషాదం జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.
Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వరుసగా 4 రోజులు సెలవులు.. అధికారిక ఉత్తర్వులు జారీ
మ్యాగీ, టీ తిన్న తర్వాతే దారుణం.. పూడ్ ఫాయిజనింగ్ ఏమైనా జరిగిందా:
ప్రాథమిక విచారణ ప్రకారం, ఆ కుటుంబం చివరిగా టీ తాగి మ్యాగీ తిన్నట్లు పొరుగువారు, పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ ఆహారంలో ఏదైనా విషపూరిత పదార్థం అధిక మోతాదులో కలవడం వల్లే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్ల జరిగిందా లేక మరేదైనా విషపూరితమైన రసాయనం ఆహారంలో కలిసిందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
స్పష్టత రాని మరణ కారణాలు.. పోస్ట్మార్టం నివేదికపైనే ఆధారపడ్డ పోలీసులు:
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ఈ మరణాలకు మ్యాగీ, టీ కారణమయ్యాయా లేదా దీని వెనుక వేరే ఏదైనా శోధించాల్సిన మిస్టరీ ఉందా అనేది పోస్ట్మార్టం రిపోర్ట్ అందిన తర్వాతే స్పష్టమవుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.
