Weather Forecast : తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మారిన వాతావరణం.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇదే!
Weather Forecast : నవంబర్ నెల ప్రారంభంకావడంతో శీతాకాల ప్రభావం క్రమంగా బలపడుతోంది. ఉదయం, రాత్రివేళల్లో చలి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఆ సమయాల్లో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
Weather Forecast
Weather Forecast : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్నమొన్నటి వరకు వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. చలిపంజా విసురుతోంది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వాతావరణ శాఖ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read : CM Revanth Reddy : ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలు.. అక్కడే భోజనం.. ఫొటోలు వైరల్..
నవంబర్ నెల ప్రారంభంకావడంతో శీతాకాల ప్రభావం క్రమంగా బలపడుతోంది. ఉదయం, రాత్రివేళల్లో చలి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఆ సమయాల్లో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రాజధాని హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17డిగ్రీల సెల్సియస్ నుంచి 19 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున నగరంలోని శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలముకుంటోంది. ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పగటి సమయంలో ఎండ తీవ్రత ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ, సాయంత్రం 5:30 గంటల తర్వాత నుంచి చల్లని గాలులు ప్రారంభమవుతున్నాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ నుంచి 16డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి మూడు డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.
వరుస తుపానుల కారణంగా గత వారంరోజుల క్రితం వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాల ప్రభావం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వర్ష సూచన లేదని, వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
