Oppo Find X9 Ultra : కొత్త ఒప్పో ఫోన్ కేక.. ఈసారి అల్ట్రా మోడల్ దిగుతోంది.. కెమెరా ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Oppo Find X9 Ultra : కొత్త ఒప్పో ఫోన్ వచ్చేస్తోంది. ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా పేరుతో గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంతకన్నా ముందే కీలక కెమెరా ఫీచర్లు లీక్ అయ్యాయి. ధర, ఇతర ఫీచర్ల వివరాలివే..
Oppo Find X9 Ultra
- ఒప్పో ఫైండ్ X9 అల్ట్రాలో అడ్వాన్స్ జూమ్ కెమెరా పర్ఫార్మెన్స్
- పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్, భారీ డిస్ప్లే, బ్యాటరీతో రావచ్చు
- 6.82-అంగుళాల భారీ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లే, 7,500mAh వరకు బ్యాటరీ
Oppo Find X9 Ultra : ఒప్పో ఫ్యాన్స్ మీకో గుడ్ న్యూస్. అతి త్వరలో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది. ఈ హ్యాండ్సెట్ ఫైండ్ X9 లైనప్‌లో రానుంది. ఇప్పటికే ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో ఫోన్లు లాంచ్ ఉన్నాయి. ఇదే లైనప్‌లోని ఇప్పుడు అల్ట్రా ఫోన్ కూడా వస్తోంది.
లాంచ్ కు ముందుగానే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ ఒప్పో ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్సెట్, మీడియా, గేమింగ్ కోసం భారీ డిస్ప్లేతో రానుంది. ఒప్పో ఇంకా పూర్తి స్పెసిఫికేషన్లను రివీల్ చేయలేదు. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రాలో ఇంకా ఏయే ఫీచర్లు ఉండొచ్చు అనేది వివరంగా తెలుసుకుందాం..
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా కెమెరా (లీక్) :
లీక్‌లను పరిశీలిస్తే.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా జూమ్ ఫొటోగ్రఫీతో వస్తుందని అంచనా. ఎఫ్/3.5 ఎపర్చర్‌తో 10x ఆప్టికల్ జూమ్ 50MP పెరిస్కోప్ లెన్స్‌తో రానుంది. నివేదికల ప్రకారం.. ఈ కాన్ఫిగరేషన్ శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రాలో 10x పెరిస్కోప్ లెన్స్ కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ లైటింగ్ అందిస్తుంది. ఎఫ్/4.9 ఎపర్చర్‌తో 10MP సెన్సార్‌తో వస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్‌లో 3x ఆప్టికల్ జూమ్‌తో 200MP టెలిఫోటో సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 200MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉన్నాయని అంచనా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఒప్పో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టుతో 50MP ఫ్రంట్ కెమెరాను అందించనుంది.
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా : స్పెషిఫికేషన్లు (అంచనా) :
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫోన్ 6.82-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేతో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో లాంచ్ అవుతుందని పుకార్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్ను కూడా అందిస్తుంది. లీక్‌ల ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్‌ను క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో పాటు 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుందని సూచిస్తున్నాయి.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు 7,000mAh నుంచి 7,500mAh బ్యాటరీతో రానుంది. 80W వరకు వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66, IP68, IP69 సర్టిఫికేట్లు కూడా పొందవచ్చు.
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
ఈ నెల ప్రారంభంలో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫోన్ గ్లోబల్ లాంచ్‌పై చైనీస్ బ్రాండ్ టీజ్ చేసింది. రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ తేదీని బ్రాండ్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ 2026 రెండవ త్రైమాసికంలో లాంచ్ కావచ్చని పుకార్లు సూచిస్తున్నాయి.
ఈ ఒప్పో ఫోన్ ఫస్ట్ చైనా మార్కెట్లో లాంచ్ కానుంది. ఆ తర్వాతే భారత్ సహా గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. నివేదికలను పరిశీలిస్తే.. ఈ ఫోన్ ఇప్పటికే థాయిలాండ్‌లో సర్టిఫికేషన్ పొందిందని సూచిస్తున్నాయి.
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా : భారత్ ధర (అంచనా) :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ధర రూ.1,25,999 నుంచి రూ.1,60,000 ధరకు లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ధరలు ఫైనల్ కాదు.. లాంచ్ సమయంలో మాత్రమే ఫైనల్ ధర ఎంత అనేది తెలుస్తుంది.
