Neelira: ఊహించని కాంబోలో ‘నీళిరా’.. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో రానా కొత్త మూవీ
రానా దగ్గుబాటి, కార్తీక్ సుబ్బరాజూ కాంబోలో వస్తున్న 'నీళిరా(Neelira)' మూవీ.
Rana Daggubati and Karthik Subbaraj producing Neelira movie
- నిర్మాతగా రానా కొత్త మూవీ ‘నీళిరా’
- శ్రీలంకన్ దర్శకుడి కొత్త ప్రయోగం
- మరో నిర్మాతగా కార్తీక్ సుబ్బరాజ్
టాలీవుడ్ భల్లాలదేవుడు రానా దగ్గుబాటి, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఆ సెన్సేషన్ ఊహించడానికి కూడా అనడం లేదు కదా. అవును, తాజా సమాచారం ఈ కాంబో సెట్ అయినట్టుగా తెలుస్తోంది. రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’, కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణ సంస్థ ‘స్టోన్ బెంచ్’ కలిసి ఉమ్మడిగా ఒక వినూత్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాయి. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ‘నీళిరా’ అనే వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
Kiran Abbavaram: దర్శకుడిగా కిరణ్ అబ్బవరం.. అంచనాలు పెంచుతున్న స్టార్స్ కాంబో
శ్రీలంకకు చెందిన తమిళ దర్శకుడు సోమిధరన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విభిన్నమైన కథాంశంతో, పక్కా రా అండ్ రస్టిక్ ఫీల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే, సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇక ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ ప్రకటించిన వివరాల ప్రకారం.. నీలిరా సినిమాను ఏప్రిల్ 3వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రోత్సహించడంలో కార్తీక్ సుబ్బరాజ్, రానా ఎప్పుడూ ముందుంటారు. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా నవీన్ చంద్ర పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానుందని సమాచారం. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూడాలి.

