Ather Energy : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? ఏథర్ స్కూటర్లపై లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఏకంగా రూ.20,000 వరకు డిస్కౌంట్..!
Ather Energy : ఏథర్ ఎనర్జీ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, రిజ్టా ఎస్, 450ఎస్ లపై లిమిటెడ్ టైమ్ ఆఫర్లను ప్రకటించింది. మార్చి 2026 వరకు రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి.
Ather Energy Offers
- ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్లు
- రూ. 20వేల వరకు ఈవీ స్కూటర్లపై కిర్రాక్ డిస్కౌంట్లు
- మార్చి 31 వరకు అన్ని ఏథర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లలో ఆఫర్లు
Ather Energy : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఆటో దిగ్గజం ఏథర్ ఎనర్జీ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఏథర్ రిజ్టా S, 450 Sలపై లిమిటెడ్ టైమ్ ఆఫర్లను ప్రకటించింది. ఆసక్తిగల వినియోగదారులు మార్చి 2026 వరకు రూ. 20,000 వరకు సేవ్ చేసుకోవచ్చు.
ఈ ఆఫర్లు మార్చి 31 వరకు దేశమంతటా ఏథర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. పీఎం ఇ-డ్రైవ్ సబ్సిడీ గడువు ముగిసే సమయంలో కంపెనీ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఎక్కువ మంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
డిస్కౌంట్ ప్యాకేజీలో 3 ఆప్షన్లు :
ఈ డిస్కౌంట్ ప్యాకేజీలో 3 ఆకర్షణీయమైన ఆప్షన్లు ఉన్నాయి. రూ. 10వేలు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, రూ. 6,500 క్యాష్ డిస్కౌంట్, రూ. 3,500 విలువైన ఎక్స్టెండెడ్ కాంపోనెంట్స్ వారంటీ కూడా అందిస్తుంది. ఈ అన్ని ఆఫర్లతో, రిజ్టా ఎస్ ఇప్పుడు రూ. 1,04,758 (ఎక్స్-షోరూమ్ ముంబై) నుంచి ప్రారంభమవుతుంది. స్టాండర్డ్ ధర కన్నా రూ.10,242 తక్కువగా ఉంటుంది.
ఏథర్ 450S స్కూటర్ ధర రూ. 1,13,100 (ఎక్స్-షోరూమ్ ముంబై), దాదాపు రూ. 17,899 ధర తగ్గింపుతో లభిస్తుంది. ఇతర వాహనాలతో పోలిస్తే అద్భుతమైన ఫీచర్లు అందిస్తుంది. ఏథర్ రిజ్టా S ప్రత్యేకంగా ఫ్యామిలీ కస్టమర్ల కోసం రూపొందింది.
2.9 kWh బ్యాటరీ, 80kWh టాప్ స్పీడ్ :
భారీ 34-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, 123 కి.మీ IDC రేంజ్ రోజువారీ పనులు, ప్రయాణాలకు చాలా బెస్ట్. 2.9 kWh బ్యాటరీ, 80kWh టాప్ స్పీడ్తో నడిచే ఈ యుటిలిటీ, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్ల వంటి ఏథర్ సిగ్నేచర్ కనెక్ట్ టెక్నాలజీలతో వస్తుంది.
450S స్కూటర్ అనేది ఎక్కువ స్పీడ్ కోరుకునే సిటీ రైడర్లకు బెస్ట్. 2.9 kWh బ్యాటరీతో వస్తుంది. 115 కి.మీ (IDC) వరకు రేంజ్ అందిస్తుంది. 6 kWh మోటారుతో వేగంగా పికప్ అందిస్తుంది. ఇక కంపెనీ ప్రోత్సాహకాలతో స్టాక్లను క్లియర్ చేసేందుకు ఈ ఆఫర్లను అందిస్తోంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ప్రయోజనాలను నెలకు రూ. 5,000 ఇ-డ్రైవ్ క్యాష్ సబ్సిడీతో పొందవచ్చు. మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది, ప్రారంభ కొనుగోలుదారులు తక్కువకే స్కూటర్ కొనేసుకోవచ్చు.
