Summer 2026 : ఈ సమ్మర్లో కొత్త AC కొనేవారికి పండగే.. మీ బడ్జెట్ ధరలోనే టాప్ 5 కొత్త విండో ఏసీలు.. తక్కువ ఖర్చు.. ఎక్కువ కూలింగ్!
Summer 2026 : ఎండాకాలం వచ్చేసింది.. ఎండలు కాకపుట్టిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. ఇంట్లో రెస్ట్ తీసుకుందామనుకుంటే ఉక్కపోత ఉక్కిరిఉక్కిరిచేస్తోంది. రూ 30వేల లోపు బడ్జెట్ ధరలో మంచి విండో ఏసీ కోసం చూస్తుంటే ఈ టాప్ 5 విండో ఏసీలు మీకోసమే..
Summer 2026
- 2026లో వేసవిలో కొత్త విండో ఏసీ కోసం చూస్తున్నారా?
- రూ. 30వేల లోపు ధరలో అద్భుతమైన విండో ఏసీలు
- కూలింగ్, ఎక్కువకాలం మన్నిక, ఇల్లంతా కూలింగ్
Summer 2026 : బాబోయ్.. ఎండలు పెరిగాయి.. ఉక్కపోత స్టార్ట్ అయింది. ఉదయం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం అయ్యేసరికి మంట వేడుక్కుతోంది. సమ్మర్ ప్రారంభంలోనే ఇలా ఉంటే మే టైంలో ఇంకెంత ఉంటుందో చెప్పన్కర్లేదు. అందుకే చాలామంది వేసవి ప్రారంభంలోనే ఏసీలు, కూలర్లు కొనేసుకుంటున్నారు.
పాత ఏసీలకు పనిచెబుతున్నారు. మీరు కూడా కొత్త ఏసీ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఇప్పడు అయితే తక్కువ ధరలో ఏసీలు దొరుకుతాయి. ఎండలు ముదిరేకొద్ది ఏసీలు ధరలు కూడా ఇంకా పెరుగుతాయి. ధర తక్కువగా ఉన్నప్పుడే కొనేసుకోవడం బెటర్.
సరసమైన ధరలో మంచి కూలింగ్ అందించే ఏసీల కోస చూస్తుంటే ప్రస్తుతం మార్కెట్లో అనేక విండో ఏసీ మోడల్స్ రూ. 30వేల లోపు ధరలో అందుబాటులో ఉన్నాయి. ఈ వేసవిలో మీరు కొనుగోలు చేసేందుకు 5 విండో ఏసీలు రెడీగా ఉన్నాయి. రూ. 30వేల బడ్జెట్‌తో ఈ వేసవి కాలంలో కూలింగ్ కోసం విండో ఏసీల జాబితాను అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చి ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు.
O జనరల్ 0.8 టన్ (రూ. 28,990) :
ఓ (O) జనరల్ నుంచి వచ్చిన ఈ విండో ఏసీ 3.2W/W ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో, 2950W కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. ఈ మోడల్ 3-స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఫిక్స్డ్-స్పీడ్ టెక్నాలజీతో సింగిల్-స్పీడ్ కంప్రెసర్ కూడా ఉంది. 712.95kWh వార్షిక పవర్ వినియోగాన్ని అందిస్తుంది. చిన్న గదులకు అద్భుతంగా ఉంటుంది.
వోల్టాస్ 183 వెక్ట్రా పెర్ల్ 1.5 (రూ. 28,900) :
వోల్టాస్ 183 డస్ట్ ఫిల్టర్‌తో 1.5 టన్నుల సామర్థ్యాన్ని అందిస్తుంది. 111 నుంచి 150 చదరపు అడుగులకు సరిగ్గా సరిపోతుంది. 48 డిగ్రీల సెల్సియస్ వద్ద టెంపరేచర్ అందిస్తుంది. దాదాపు 1185.93kWh వార్షిక వినియోగాన్ని కూడా అందిస్తుంది. 4750W ISSER వాల్యూతో వస్తుంది. R32 రిఫ్రిజెరెంట్ గ్యాస్, 100 శాతం కాపర్ కండెన్సర్, 230-వోల్ట్ రేంజ్ స్టెబిలైజర్-లెస్ ఆపరేషన్ వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది.
గోద్రేజ్ 1.5 టన్ (రూ. 28,490) :
ఈ గోద్రెజ్ విండో ఏసీ 3-స్టార్ రేటింగ్‌తో వస్తుంది. వార్షిక పవర్ వినియోగం 1203.74 యూనిట్లు. ISEER వాల్యూ 3.15 కూడా అందిస్తుంది. ఈ యూనిట్ R32 రిఫ్రిజెరెంట్ గ్యాస్, యాంటీకోరోసివ్ బ్లూ ఫిన్లతో 100 శాతం కాపర్ కండెన్సర్, హైడ్రోఫిలిక్ బ్లూ ఫిన్ ఎవాపరేటర్, యాంటీ-డస్ట్ ఫిల్టర్ వంటి ఫీచర్లతో వస్తుంది. కంప్రెసర్‌పై 5 ఏళ్ల వరకు ఎక్స్ టెండెడ్ వారంటీతో పాటు ప్రొడక్టుపై ఒక ఏడాది వారంటీని కూడా అందిస్తుంది.
బ్లూ స్టార్ 1.5 టన్ (రూ. 29,999) :
బ్లూ స్టార్ విండో ఏసీ 1.5 టన్నుల సామర్థ్యాన్ని అందిస్తుంది. 16548 కిలోవాట్ల కూలింగ్ పవర్, డస్ట్ ఫిల్టర్ కూడా అందిస్తుంది. ప్రీసెట్ మోడ్ కూడా ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలలో గదిని వెంటనే కూల్ చేస్తుంది. ఇంకా, వార్షిక పవర్ వినియోగాన్ని 1192.12, ISEER వాల్యూ 3.15 అందిస్తుంది.
క్యారియర్ 1.5 టన్ (రూ. 28,990) :
క్యారియర్ విండో ఏసీ 5000W కూలింగ్ కెపాసిటీతో 1.5 టన్ను కెపాసిటీ, ఇన్వర్టర్ టెక్నాలజీతో R-32ని అందిస్తుంది. ఈ యూనిట్ 111-150 చదరపు అడుగుల గదులకు బెస్ట్ ఏసీ. 1210.35kWh వార్షిక వినియోగంతో 52°C వద్ద టెంపరేచర్ అందిస్తుంది.
