Pawan Kalyan : టికెట్ రేట్ల పెంపు పై మాట్లాడిన పవన్.. వేరే హీరోలకు నా కంటే ఎక్కువే పెంచాను..
ఈ క్రమంలో టికెట్ రేట్ల పెంపు గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. (Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది రోజు రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు, సినిమాకు పనిచేసిన వారి గురించి, పలు అంశాల గురించి మాట్లాడారు.
ఇటీవల పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టికెట్ రేట్ల పెంపు గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Also See : Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఫొటోలు..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరి హీరోల సినిమాలు బాగుండాలి. టికెట్ రేట్లు పెంచడంపై కొంతమంది మాట్లాడతారు. సినిమా కంపల్సరీ కాదు. గన్ పెట్టి చూడమని చెప్పం కదా. మొదటిరోజే చూడాలని ఏం లేడు కదా. ఇంక నేను నా సినిమాలకు తక్కువ రేట్లు ఇచ్చుకొని పుష్ప, కల్కి.. ఇలా వేరే హీరోలకు ఎక్కువ రేట్లు ఇచ్చాను. టికెట్ రేటు పెంచిన దానిపై 18 శాతం GST గవర్నమెంట్ కి వస్తుంది. వదిలేస్తే బ్లాక్ లో టికెట్ అమ్ముకుంటారు. ఆ డబ్బులు ఎటు పోతాయో తెలీదు. అందుకే అన్ని ఆలోచించి హీరో ఎవరు అనేది సంబంధం లేకుండా ఏ హీరో సినిమా వచ్చినా టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు.
కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు చింపినా సినిమా బాగుండాలని నేను కాంతార సినిమాకు పర్మిషన్ ఇచ్చాను. సినిమా బాగుండాలి. ఫ్యాన్ వార్స్ చూస్తూ ఉంటాను. ఆన్లైన్ లో అది కరెక్ట్ వాతావరణం కాదు. నేను ఒక హీరోగా చెప్తున్నా అందరి హీరోల అభిమానులను గౌరవిస్తాను. ఏ హీరోతో విబేధాలు లేవు నాకు. అందరు హీరోలు హిట్స్ కొట్టాలి. నేను చాలా సార్లు చెప్పాను ఇది. ఒక హీరోగా నిర్మాతలు బాగుండాలి. భీమ్లా నాయక్ సినిమా సమయంలో టికెట్ రేట్ల విషయంలో మీరంతా నా కోసం నిలబడ్డారు అని అన్నారు.
Also Read : Pawan Kalyan : మళ్ళీ ఆ ధైర్యం ఇచ్చింది ఈ సినిమా.. ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ స్పీచ్..
