Gold Silver Prices Today : బంగారం కొనేవాళ్లకు బిగ్ అలర్ట్.. గోల్డ్ రేటులో ఊహించని మార్పులు.. కారణాలివే..
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. గోల్డ్ రేటులో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. రెండు రోజులుగా గోల్డ్ ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతవారం భారీగా తగ్గుతూ వచ్చిన రేటు.. నిన్న, ఇవాళ మాత్రం భారీగా పెరగడం కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక పాలసీ సమావేశానికి ముందు ఊహించని పరిణామాల మధ్య బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గడచిన కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ జూలై చివరి నాటి కనిష్ట స్థాయిలకు పడిపోయిన పసిడి.. ట్రేడింగ్లో కోలుకుని తిరిగి 4వేల డాలర్ల మార్కును అధిగమించింది. భారతదేశంలో గడిచిన వారంలో తులం బంగారంపై సుమారు 4వేలు తగ్గగా.. నిన్న, ఇవాళ గోల్డ్ రేటు భారీగా పెరిగింది.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 540 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 500 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు మళ్లీ 4,020 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,290 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,440 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,31,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,290కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,20,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,20,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,20,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
