Benjamin Netanyahu: నేను చనిపోలేదు.. కేఫ్ లో కాఫీ తాగుతూ.. స్వయంగా వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
నెతన్యాహు చనిపోవడంతో ఇజ్రాయెల్ ఆయన ఏఐ వీడియో రిలీజ్ చేసిందని, అందులో చేతికి 6 వేళ్లు ఉన్నాయన్న ప్రచారం జరిగింది.
Representative Image (Image Credit To Original Source)
- నేను బతికే ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయల్ ప్రధాని నెతన్యాహు
- కేఫ్ లో కాఫీ తాగుతూ కనిపించిన నెతన్యాహు
- దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని వెల్లడి
Benjamin Netanyahu: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు మిస్సైళ్ల వర్షం కురిపించుకుంటున్నారు. అయితే, 3 వారాలుగా యుద్ధం జరుగుతున్నా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కనిపించకపోవడంతో ఆయన ఉనికిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో నెతన్యాహు చనిపోయారనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా జరిగింది. కొన్ని రోజులుగా నెతన్యాహు ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. ఈ క్రమంలో నేను చనిపోలేదు అంటూ స్వయంగా నెతన్యాహు రిలీజ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
ప్రధాని నెతన్యాహు చనిపోయారనే వార్తలను ఇజ్రాయెల్ ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా నెతన్యాహు ఒక వీడియో రిలీజ్ చేశారు. టెల్ అవీవ్‌లోని ఓ కేఫ్‌లో కాఫీ తాగుతూ ఆయన కనిపించారు. ఈ వీడియో ద్వారా తనపై వస్తున్న వదంతులను తిప్పికొట్టారు నెతన్యాహు. అంతేకాదు తాను కాఫీ కోసం చనిపోతాను అంటూ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారాయన. నెతన్యాహు చనిపోవడంతో ఇజ్రాయెల్ ఆయన ఏఐ వీడియో రిలీజ్ చేసిందని, అందులో చేతికి 6 వేళ్లు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. దీనిపైనా నెతన్యాహు స్పందించారు. చేతులను చూపించి కౌంటర్ ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని నెతన్యాహు తేల్చి చెప్పారు.
ఈ వీడియోలో నెతన్యాహు తన రెండు చేతులను పైకెత్తి కెమెరాకు తన వేళ్లను చూపిస్తారు. మీరు నా వేళ్లను లెక్కించాలనుకుంటున్నారా? ఇదిగోండి లెక్కించుకోండి అని అందులో అనడం ఉంది. ఈ వీడియోలో ఆయన ఇజ్రాయెల్ పౌరులకు సందేశం ఇచ్చారు. “బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి, కానీ రక్షిత స్థలంలో ఉండండి. మీ మద్దతు నాకు, ప్రభుత్వానికి, ఐడిఎఫ్కు, మొసాద్‌కు బలాన్ని ఇస్తుంది. నేను చేయలేని పనులను మేము చేస్తున్నాము. ఈరోజు కూడా ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాము. మీరు నన్ను ముందుకు సాగమని చెబుతున్నారా? మీరు కూడా ముందుకు సాగండి” అని నెతన్యాహు అన్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 16వ రోజుకు చేరుకుంది. ఈ తరుణంలో ఈ వీడియో బయటకు వచ్చింది. గత నెలలో అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్‌పై సంయుక్త దాడులకు దిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా బేస్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అటు ఇజ్రాయెల్ పైనా అటాక్స్ చేస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Also Read: హర్మూజ్ జలసంధి బంద్‌పై ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు.. వారి నౌకలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడి..
אומרים שאני מה? צפו >> pic.twitter.com/ijHPkM3ZHZ
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) March 15, 2026
