Iran vs Israel War : హర్మూజ్ జలసంధి బంద్‌పై ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు.. వారి నౌకలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడి..
Iran vs Israel War : కేవలం అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే హర్మూజ్ జలసంధిని మూసివేయడం జరుగుతుందని, ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చునని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు.
Iranian Foreign Minister Abbas Araghchi
- హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది
- అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే అనుమతి లేదు
- ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించొచ్చు
- ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ
Iran vs Israel War : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. యుద్దం రోజురోజుకు తీవ్రమవుతున్న వేళ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను ఇరాన్ నిలిపివేసింది. హర్మూజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్రదేశాలకు చెందిన నౌకలను టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అయితే, ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై అరాగ్చీ క్లారిటీ ఇచ్చారు.
Also Read : Tamilnadu : తమిళనాడుపై బీజేపీ గురి.. టీవీకే విజయ్‌కు భారీ ఆఫర్? తెరపైకి పవన్ కల్యాణ్ పేరు..!
కేవలం అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే హర్మూజ్ జలసంధిని మూసివేయడం జరుగుతుందని, ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చునని చెప్పారు. అయితే, భద్రతా సమస్యల కారణంగా అనేక దేశాలు ముందుకు రావడం లేదని, దీనికి ఇరాన్ తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధి మీదుగా అనేక చమురు ట్యాంకర్లు, నౌకలు ప్రయాణిస్తున్నాయని అబ్బాస్ అరాగ్చీ తెలిపారు.
ఇటీవల దాడుల్లో నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గాయపడినట్లు వస్తున్న వార్తలపై అరాగ్చీ స్పందిస్తూ.. ఆయనకు ఎటువంటి సమస్య లేదు, రాజ్యాంగం ప్రకారం మొజ్తాబా తన విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఒకవేళ కీలక వ్యక్తులకు ప్రాణనష్టం సంభవించినా ఇరాన్ తట్టుకోగలదని, ఏ ఒక్క వ్యక్తిపైనా ఇరాన్ ఆధారపడి లేదని, అన్నింటిని తట్టుకోగలదని.. అయితే, ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులోనే ఉందని అరాగ్చీ పేర్కొన్నారు.
