FD Interest Rates : సీనియర్ సిటిజన్లకు పండగే.. ఈ బ్యాంకులో 12 నెలల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? ఫుల్ డిటెయిల్స్!
FD Interest Rates : సాధారణ పౌరులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్ల ఎఫ్డీ ఖాతాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.50 శాతం అధిక వడ్డీని అందిస్తోంది. పూర్తి వడ్డీ రేట్ల వివరాలివే..
FD Interest Rates
- బ్యాంకు ఆఫ్ ఇండియాలో FD ఖాతాలపై వడ్డీ రేట్లు
- సీనియర్, సూపర్ సీనియర్లకు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?
- 12 నెలల ఎఫ్డీ ఖాతాలపై ఎంత వడ్డీ వస్తుందంటే?
FD Interest Rates : సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన స్కీమ్.. ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఖాతాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో FD ఖాతాలను కనీసం 7 రోజుల కాలపరిమితితో ఓపెన్ చేయొచ్చు.
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో లాంగ్ టైమ్ FD ఖాతాను ఓపెన్ చేయాలనుకుంటే గరిష్టంగా 10 ఏళ్ల టెన్యూర్ FD ఖాతాను ఓపెన్ చేయొచ్చు. 12 నెలల FDపై బ్యాంక్ ఎంత వడ్డీని అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
12 నెలల FDపై వడ్డీ ఎంతంటే? :
బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు 12 నెలల ఎఫ్డీలపై 6.50శాతం నుంచి 7.15శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 12 నెలలు మెచ్యూరిటీ టెన్యూర్ FD ఖాతాలపై, 59 ఏళ్ల వయస్సు లోపు ఉన్న కస్టమర్లకు బ్యాంకు 6.50శాతం వడ్డీని అందిస్తోంది.
60 ఏళ్లు ఆపై వయస్సు ఉన్న కస్టమర్లకు 12 నెలల FD పథకాలపై 7.00శాతం వడ్డీని, 80 ఏళ్లు ఆపై వయస్సు ఉన్న ఖాతాదారులకు 7.15శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు కేవలం రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి.
సీనియర్ సిటిజన్లకు బెనిఫిట్స్ :
సాధారణ పౌరులతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్ల ఎఫ్డి ఖాతాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.50 శాతం అధిక వడ్డీని అందిస్తోంది. సూపర్ సీనియర్లు 80 ఏళ్లు లేదా ఆపై వయస్సు ఉన్నవారు, సాధారణ ఖాతాదారుల కన్నా 0.65 శాతం అధిక వడ్డీని పొందవచ్చు. కనీసం 6 నెలలు గరిష్టంగా 3 ఏళ్ల ఎఫ్డి ఖాతాలపై మాత్రమే బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లకు ఈ అదనపు వడ్డీ బెనిఫిట్స్ అందిస్తుంది.
FD వడ్డీ రేట్లపై రెపో రేటు ఎఫెక్ట్ :
ఆర్బీఐ వరుసగా నాల్గోసారి రెపో రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ చివరిసారిగా 2025 డిసెంబర్లో రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గించి 5.25 శాతానికి చేర్చింది. రెపో రేటును తగ్గించడంతో రుణ వడ్డీ రేట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు భారీగా తగ్గుతాయి. అంతేకాదు.. రెపో రేటును పెంచితే రుణ వడ్డీ రేట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు రెండూ పెరుగుతాయి.
