Mahesh babu : రాముడి పాత్రలో మహేశ్.. జక్కన్న ఎలా చూపించబోతున్నాడు!
Mahesh babu : రామాయణం సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకున్న వేళ.. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి మూవీపై డిస్కషన్ స్టార్ట్ అయింది.
How Mahesh babu role of Rama in varanasi movie
Mahesh babu : రామాయణం సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకున్న వేళ.. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి మూవీపై డిస్కషన్ స్టార్ట్ అయింది. రామాయణంలో శ్రీరాముడిగా నటించిన రణ్‌బీర్ కపూర్ నటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాముడి పాత్రలో రణ్‌బీర్ అద్భుతంగా నటించారని కొందరు ప్రశంసిస్తుంటే.. ఆయన లుక్స్, నటన ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయని, శ్రీరాముడి పాత్రతో ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేకపోయారని మరికొందరు ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారు.
Vaishnavi Chaitanya : తెలుగు అందం వైష్ణవి చైతన్య.. దీపావళి స్పెషల్ ఫోటోలు..
రాముడి పాత్రను తెరపై ఆవిష్కరించడం ఎంత బాధ్యతతో కూడుకున్నదో ఈ చర్చను బట్టి మరోసారి స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తికరమైన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
ఇప్పటికే సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్‌ను శ్రీరాముడిగా రాజమౌళి ఎలా చూపించబోతున్నారు.? ఆయన రూపం, ఆహార్యం, నటనతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాముడి పాత్రకు ప్రేక్షకుల్లో ఉండే భావోద్వేగ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఈ పాత్ర మహేష్ కెరీర్లోనే మరో పెద్ద పరీక్షగా మారుతుందా.? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
