Vivo T5 Pro 5G Price : బాబోయ్.. ఫోన్ అదే.. ఫీచర్లు అవే.. వేలల్లో పెరిగిన వివో 5G ఫోన్ ధరలు..!
Vivo T5 Pro 5G Price : వివో T5 ప్రో 5G ధర మళ్లీ పెరిగింది. 8GB ర్యామ్ రెండు వేరియంట్ల ధరలు ఇప్పుడు వరుసగా రూ.6వేలు, రూ.7వేల వరకు పెరిగాయి. పూర్తి వివరాలివే..
Vivo T5 Pro 5G Price
- వివో టి5 ప్రో 5జీ ధర రూ. 7వేల వరకు పెంపు
- రెండు 8GB వేరియంట్లు గతంలో కన్నా ఖరీదు
- 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 9,020mAh బ్యాటరీ
Vivo T5 Pro 5G Price : వివో లవర్స్‌కు బిగ్ షాక్.. వివో T5 ప్రో 5G ఫోన్ ధర భారీగా పెరిగింది. ఈ ఫోన్లోని 8GB ర్యామ్ రెండు వేరియంట్ల ధరలను కంపెనీ అమాంతం పెంచేసింది. ఈ కొత్త ధరతో ఫోన్ గతంలో కన్నా ఖరీదైనదిగా మారింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఈ సెగ్మెంట్లో పోటీ కారణంగా ధర పెంచేసింది.
ప్రస్తుతం వివో టి5 ప్రో 5జీ ఫోన్ 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్ల ధరలు భారీగా పెరిగాయి. గతంలో రూ.35,999గా ఉన్న 8GB + 128GB మోడల్ ధర ఇప్పుడు రూ.41,999కి పెరిగింది. 8GB + 256GB వేరియంట్ ధర రూ.39,999 నుంచి రూ.46,999కి చేరింది. ఈ రెండు మోడళ్ల ధరలు వరుసగా రూ.6వేల నుంచి రూ.7వేల వరకు పెరిగాయి.
వివో టీ5 ప్రో 5జీ ఏప్రిల్ 2026లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.29,999గా ఉండేది. 8జీబీ + 256జీబీ మోడల్ ధర రూ.33,999గా, 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.39,999గా ఉండేది. కానీ, ఈ ఫోన్ ధర చాలాసార్లు పెరిగింది. ఇప్పుడు రెండు 8GB మోడళ్ల ధరలు మళ్లీ పెరిగాయి.
Read Also : Realme P4s Launch : మిడ్‌రేంజ్‌లో కొత్త బ్యాటరీ కింగ్? రియల్‌మి P4s 5జీ లాంచ్‌కు రెడీ.. కీలక ఫీచర్లు ఇవే!
వివో T5 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు :
వివో T5 ప్రో 5జీ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.83-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ అందిస్తుంది. కంపెనీ ఇందులో 7K వీసీ కూలింగ్ కూడా చేర్చింది. ఈ ఫోన్ 120 FPS గేమింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
కెమెరాల విషయానికొస్తే.. :
ఈ ఫోన్ బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా ఉంది. 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ 6తో వస్తుంది. కంపెనీ 3 ఏళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందించనుంది.
వివో T5 ప్రో 5జీ 9,020mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్ 37 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు. బ్యాటరీ హెల్త్ 5 ఏళ్లపాటు ఉంటుంది. ఈ ఫోన్ మందం 8.25mm, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ అందిస్తుంది. కాస్మిక్ బ్లాక్ గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
