Raipur Minor Girl: కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. గర్భందాల్చిన పాప.. రాయ్‌పూర్ ఆస్పత్రిలో అమానుషం
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో(Raipur Minor Girl) మానవత్వానికే మచ్చ తెచ్చే అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
Raipur minor girl raped by father forced abortion
- పసికందు అమ్మకంలో డాక్టర్ హస్తం
- నకిలీ ఆధారాలతో తండ్రి దారుణాలు
- ఆరుగురు నిందితుల అరెస్ట్
Raipur Minor Girl: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మానవత్వానికే మచ్చ తెచ్చే అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సమాజంలో రక్షణగా నిలవాల్సిన కన్న తండ్రే రాక్షసుడిగా మారి తన 16 ఏళ్ల మైనర్ కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అక్రమ సంబంధం వల్ల బాలిక మొదటిసారి గర్భవతి కాగా, విషయం ఎవరికీ తెలియకుండా దౌర్జన్యంగా అబార్షన్ మాత్రలు ఇచ్చి కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కూడా అతడి ఆగడాలు ఆగకపోవడంతో బాలిక రెండోసారి గర్భం దాల్చింది.
నకిలీ ఆధారాలు & పసికందు విక్రయం
ఈ దారుణాన్ని బయటపడకుండా చూసేందుకు నిందితుడు నకిలీ ఆధార్ కార్డును ఫోర్జరీ చేసి, బాలికను(Raipur Minor Girl) మేజర్‌గా చూపించేలా తప్పుడు ఆధారాలు సృష్టించాడు. అనంతరం దంగనియాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, సిజేరియన్ ద్వారా మగబిడ్డ జన్మించాడు. ఆ నవజాత శిశువును ఒక డాక్టర్ సహాయంతో ఇతరులకు విక్రయించి, బాలికను కొన్నిరోజులు వేరే ప్రదేశంలో ఉంచి ఏమీ ఎరుగనట్లు మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లాడు.
పోలీసుల వేగవంతమైన చర్యలు & ఆరుగురి అరెస్ట్
బాధిత మైనర్ ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రితో సహా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోక్సో (POCSO) మరియు చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాల కింద కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
