గ్రీన్ టీ ఎంత పాపులర్ అంటే, 'డైట్' అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్ టీ అందులో తప్పకుండా ఉంటుంది”అని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సోషల్ మీడియాలో చెబుతున్నారు.
యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా పేరు తెచ్చుకున్న గ్రీన్ టీ నిజంగా బరువు తగ్గడంలో ఎంతవరకూ సహాయపడుతుందో తెలుసుకుందాం?
“గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అంతేకానీ కొవ్వు తగ్గించి బరువు తగ్గడానికి కచ్చితమైన పదార్థాలు లేవు”అంటున్నారు నిపుణులు.
కామెల్లియా సినెన్సిస్ మొక్క నుండి తయారైన గ్రీన్ టీకి.. ఆకుపచ్చ రంగు కారణంగా దాని పేరు వచ్చింది.
“ఇది ఇన్‌డైరక్ట్‌గా (బరువు తగ్గడానికి) ఉపయోగపడుతుంది. ఎందుకంటే వేడి లిక్విడ్ తాగడం వలన కోరికలను తగ్గిస్తుంది.
గ్రీన్ టీలో తేనెను అతిగా జోడించినట్లయితే, బరువు తగ్గడం రివర్స్ అవుతుంది.
గ్రీన్ టీ తాగేటప్పుడు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, పెద్ద మొత్తంలో గ్రీన్ టీ తాగడం వల్ల కెఫీన్ ఎక్కువగా ఉండటం వల్ల దుష్ప్రభావాలు కలగవచ్చు.