ఐటీ ఉద్యోగుల కోసం భారతీయ ఐటీ కంపెనీ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌‌లో ఒక చిన్న IT కంపెనీ తమ ఉద్యోగుల కోసం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 

అదే.. వర్క్ బ్యాలెన్స్ (#WorkLifeBalance) విధానం.. 

అన్నింటికంటే తమ ఉద్యోగుల పని-జీవిత సమతుల్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది. 

ఉద్యోగుల పని-జీవిత సమతుల్యతకు ప్రాధాన్యతనిస్తూ ఆచరణాత్మకంగా అడుగులు వేస్తోంది 

ఇండోర్‌లోని సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్ (SoftGrid Computers) కంపెనీ. 

ఇంతకీ ఈ కొత్త వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విధానం ఏంటో తెలుసా? 

ఉద్యోగులను వారి షిఫ్ట్ గంటలు ముగిసిన తర్వాత పనిచేయడానికి ఎంతమాత్రం అనుమతించదు. 

ఉద్యోగుల షిఫ్ట్ ముగిసినప్పుడు వారి కంప్యూటర్ స్క్రీన్‌లపై ఒక పాప్-అప్‌ కనిపిస్తుంది. 

మీ షిప్ట్ ముగిసింది.. ఇక మీ ఇంటికి వెళ్లిపోవాలని ఐటీ ఉద్యోగులకు ఈ రిమైండర్ గుర్తుచేస్తుంది.