Indian IT company : మీ షిఫ్ట్ ఈజ్ ఓవర్.. చేసింది చాలు.. ఇక ఇళ్లకు పోండి.. కంప్యూటర్లకు లాకేసి ఉద్యోగులను ఇంటికి పంపుతున్న ఐటీ కంపెనీ.. ఎందుకో తెలుసా?

Indian IT company : అసలే ఉరుకుల పరుగుల జీవితం.. అందులోనూ ఆఫీసుల్లో గంటల తరబడి పని.. ఇది ఐటీ ఉద్యోగుల పరిస్థితి.. తీవ్ర పనిఒత్తిడి కారణంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను సకాలంలో చేయలేకపోతున్నామనే ఆవేదన ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Indian IT company : మీ షిఫ్ట్ ఈజ్ ఓవర్.. చేసింది చాలు.. ఇక ఇళ్లకు పోండి.. కంప్యూటర్లకు లాకేసి ఉద్యోగులను ఇంటికి పంపుతున్న ఐటీ కంపెనీ.. ఎందుకో తెలుసా?

Indian IT company locks employees' desktops after shift hours and reminds them to go home

Indian IT company : అసలే ఉరుకుల పరుగుల జీవితం.. అందులోనూ ఆఫీసుల్లో గంటల తరబడి పని.. ఇది ఐటీ ఉద్యోగుల పరిస్థితి.. తీవ్ర పనిఒత్తిడి కారణంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను సకాలంలో చేయలేకపోతున్నామనే ఆవేదన ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఐదు అంకెల జీతమైన ప్రశాంతంగా గడిపేందుకు క్షణం కూడా తీరిక ఉండదు. దీని కారణంగా చేసే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఫలితంగా కంపెనీలో అనేక సమస్యలు ఎదురువుతుంటాయి. సాధారణంగా ఐటీ ఉద్యోగులను చూడగానే ప్రతిఒక్కరి నుంచి ఇలాంటివే ఎక్కువగా వినిపిస్తుంటాయి. అందుకే కాబోలు.. ఐటీ ఉద్యోగుల కోసం భారతీయ ఐటీ కంపెనీ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌‌లో ఒక చిన్న IT కంపెనీ తమ ఉద్యోగుల కోసం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

 ఈ కొత్త వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విధానం ఏంటో తెలుసా?
అదే.. వర్క్ బ్యాలెన్స్ (#WorkLifeBalance) విధానం.. అన్నింటికంటే తమ ఉద్యోగుల పని-జీవిత సమతుల్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది. ఒకవైపు.. టెక్ ప్రపంచంలో ఉద్యోగుల తొలగింపులకు సంబంధించి వింటున్న ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల పని-జీవిత సమతుల్యతకు ప్రాధాన్యతనిస్తూ ఆచరణాత్మకంగా అడుగులు వేస్తోంది ఈ భారతీయ ఐటీ కంపెనీ.. అదే.. ఇండోర్‌లోని సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్ (SoftGrid Computers) కంపెనీ. ఇంతకీ ఈ కొత్త వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విధానం ఏంటో తెలుసా? తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను వారి షిఫ్ట్ గంటలు ముగిసిన తర్వాత పనిచేయడానికి ఎంతమాత్రం అనుమతించదు. ఉద్యోగుల షిఫ్ట్ ముగిసినప్పుడు వారి కంప్యూటర్ స్క్రీన్‌లపై ఒక పాప్-అప్‌ కనిపిస్తుంది. అంటే.. మీ షిప్ట్ ముగిసింది.. ఇక మీ ఇంటికి వెళ్లపోవాలని ఐటీ ఉద్యోగులకు ఈ రిమైండర్ గుర్తుచేస్తుంది.

Indian IT company locks employees' desktops after shift hours and reminds them to go home

Indian IT company locks employees’ desktops after shift hours and reminds them to go home

సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి తన్వి ఖండేల్‌వాల్ తన (LinkedIn)లో ఇదే విషయాన్ని షేర్ చేశారు. అయితే ఆమె చేసిన ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఐటీ ఉద్యోగి తన్వి తన పోస్ట్‌లో.. కంపెనీ యజమాని పని-జీవిత సమతుల్యతకు మద్దతిస్తున్నారని, పని గంటల తర్వాత ఆమె సిస్టమ్ ఆటోమాటిక్‌గా లాక్ అవుతుందని తెలిపారు. తమ ఆఫీసులో కొత్త విధానం గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ‘మా కంపెనీ (#WorkLifeBalance)కి పూర్తిగా మద్దతిస్తోంది. అందుకే ఉద్యోగులు పనిచేసే డెస్క్‌టాప్ స్ర్కీన్లపై ఈ స్పెషల్ రిమైండర్‌ కనిపిస్తుంది. పని గంటల తర్వాత డెస్క్‌టాప్‌ను లాక్ చేసి వార్నింగ్ మెసేజ్ వస్తుంది. మీ షిప్ట్ ముగిసిన తర్వాత ఆఫీసులో పనిచేయడానికి అనుమతిలేదు. ఎలాంటి ఫోన్ కాల్స్, మెయిల్‌లు చూడటానికి వీలులేదు. ఇది నిజంగా అద్భుతమైనది కాదా? అంటూ ఉద్యోగి తన పోస్టులో రాసుకొచ్చింది.

Read Also : Apple Watch Ultra : రూ.1500 లోపు ధరకే ఆపిల్ వాచ్ అల్ట్రా ఫీచర్లతో కొత్త స్మార్ట్‌వాచ్.. ఇప్పుడే కొనేసుకోండి..!

ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఈ విధానం ఎంతో ప్రేరణ కలిగిస్తుందని ఆమె తెలిపింది. ఈ ఆధునిక యుగంలో సౌకర్యవంతమైన పని గంటలతో పాటు సంతోషకరమైన వాతావరణం ఎంతో అవసరమని తన్వి అభిప్రాయపడింది. అంతేకాదు.. తమ కంపెనీ కంప్యూటర్లలో కనిపించే వార్నింగ్ మెసేజ్ కూడా ఆమె పోస్ట్ చేసింది. ఆ నోటిఫికేషన్‌లో ‘హెచ్చరిక.. మీ షిఫ్ట్ సమయం ముగిసింది. ఆఫీస్ సిస్టమ్ 10 నిమిషాల్లో షట్ డౌన్ అవుతుంది. దయచేసి మీ ఇంటికి వెళ్లండ’ అని ఉంది. ఈ కంపెనీలో తన్వి రిక్రూటర్‌గా పనిచేస్తోంది. ఆమె తన (LinkedIn) ప్రొఫైల్ ప్రకారం ఈ ఏడాది జనవరిలో కంపెనీలో చేరింది. సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్‌లలో 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Indian IT company locks employees' desktops after shift hours and reminds them to go home

Indian IT company locks employees’ desktops after shift hours and reminds them to go home

కంపెనీ సీఈఓ ఏమన్నారంటే? :
కంపెనీ CEO, అజయ్ గోలానీ మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు మంచి పని-జీవిత సమతుల్యతను నిర్ధారించడమే ఈ చర్య వెనుక ఉద్దేశ్యం. ఉద్యోగులు షిప్ట్ ముగిసిన తర్వాత తమ ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపవవచ్చు. దీని వెనుక ఉన్న ఆలోచన ఉద్యోగులకు మంచి పని-జీవిత సమతుల్యతను అందించవచ్చు. తద్వారా వారు తమ కుటుంబాలు, ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది’ అని ఆయన అన్నారు. మరో ఉద్యోగి కృతికా దూబే మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ పనిగంటలను పొడిగించడకుండా ఈ నోటిఫికేషన్ సమయానికి బయలుదేరడానికి ఇంట్లో ఇతర బాధ్యతలను నెరవేర్చడానికి సాయపడిందని చెప్పారు. ఈ విషయంలో ఐటీ ఉద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో పనిచేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

Read Also : HP Omen 17 Gaming Laptop : హెచ్‌పీ నుంచి సరికొత్త ఒమెన్ గేమింగ్ ల్యాప్‌టాప్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర కూడా హైరేంజ్‌లోనే..