Motorola G67 Power 5G : లాంగ్ బ్యాటరీతో పవర్ఫుల్ బడ్జెట్ ఫోన్.. ఈ మోటోరోలా 5G ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 2 రోజులు ఎంజాయ్!
Motorola G67 Power 5G : మోటోరోలా జీ67 పవర్ 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే ఈ మోటో ఫోన్ మీ బడ్జెట్ ధరలో ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Motorola G67 Power 5G : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు రూ. 20వేల లోపు ధరలో మంచి బడ్జెట్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ మోటోరోలా ఫోన్ కొనేసుకోవచ్చు. ప్రస్తుతం మోటో G67 పవర్ 5G అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు.

ఈ మోటోరోలా ఫోన్ భారీ 7000mAh బ్యాటరీతో కేవలం రూ. 16,999 ధరకు లభిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. సోనీ ప్రొఫెషనల్ సెన్సార్ కూడా ఉంది. వివో, రెడ్మి వంటి కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది. మోటోరోలా నుంచి వచ్చిన ఈ కొత్త పవర్‌హౌస్ ఫోన్ ప్రతి ఫీచర్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

7000mAh బ్యాటరీ ఆప్షన్ : మోటో G67 పవర్ 5G ఫోన్ భారీ 7000mAh బ్యాటరీతో వస్తుంది. మోటోరోలా అడ్వాన్స్ ‘సిలికాన్-కార్బన్’ బ్యాటరీ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఫోన్ బ్యాకప్ మ్యాజికల్ పవర్ బ్యాంక్ మాదిరిగా ఉంటుంది. గేమింగ్ ఆడినా సినిమాలు చూసినా లేదా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా 2 రోజుల పాటు పనిచేస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్లో భారీ బ్యాటరీ, సరికొత్త టెక్నాలజీతో వస్తుంది.

సోనీ ప్రొఫెషనల్ కెమెరా : ఫొటోగ్రఫీ ప్రియుల కోసం బ్యాక్ సైడ్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో 50MP సోనీ LYT 600 సెన్సార్ అందిస్తుంది. మీ ఫోటోలు, వీడియోలు స్పష్టంగా ఉండేలా చేస్తుంది. అదనంగా, ఇందులో 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, సెల్ఫీ ప్రియుల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మీ సోషల్ మీడియా పోస్టులకు ప్రొఫెషనల్ లుక్ అందిస్తాయి.

స్పీడ్ పరంగా మోటో G67 పవర్ 5G క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. మోటోరోలా ర్యామ్ బూస్ట్ టెక్నాలజీతో వస్తుంది. 8GB ఫిజికల్ ర్యామ్ 24GB వరకు పెంచుకోవచ్చు.

మోటోరోలా ఫోన్ సేఫ్టీ కోసం స్క్రీన్కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i లేయర్ ఉంది. మంచి సౌండ్ క్వాలిటీ కోసం డాల్బీ అట్మాస్‌తో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. మూవీలు చూసే సమయంలో అద్భుతమైన థియేటర్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు.

సినిమాటిక్ సౌండ్ : మోటోరోలా డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్ అందిస్తుంది. థియేటర్ లాంటి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ధర విషయానికి వస్తే.. 8GB,128GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 16,999కే లభిస్తుంది. అమెజాన్‌లో కొన్ని ఆఫర్లతో ధర రూ. 16,123 వరకు ఉండవచ్చు. వివో T4x 5జీ, పోకో M7 ప్రో వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.
