Bank Holiday : మీకు బ్యాంకులో పని ఉందా? మార్చి 19 ఉగాది రోజున సెలవా కాదా? ఆర్బీఐ హాలిడే లిస్ట్ ఇదిగో
Bank Holiday : మార్చి 19, 2026న కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఉగాది, తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజున పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. మీ ప్రాంతంలో బ్యాంకులకు సెలవు ఉందా? లేదో ముందుగా తెలుసుకోండి.
Bank Holiday Today
Bank Holiday : పండగ రోజున మీరు బ్యాంకుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే బ్యాంకుకు వెళ్లే ముందు చెక్ చేసుకోండి. మార్చి 19, 2026 ఉగాది పండగ రోజున దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. నవరాత్రి, గడి పడ్వా, ఉగాది, తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజు రోజున అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఉగాది పండగ సందర్భంగా ఆర్బీఐ బ్యాంకులకు సెలవు ప్రకటించింది.
మార్చి నెలలో వివిధ పండుగల కారణంగా వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మూతపడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం.. దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవులు ఒకేలా ఉండవు. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. అయితే ఇతర ప్రదేశాలలో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.
ఈ రాష్ట్రాల్లో మార్చి 19న బ్యాంకులు పనిచేయవు :
బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్, విజయవాడలలో ఉగాది రోజున బ్యాంకులు మూతపడతాయి. దేశంలోని పలు ప్రాంతాలలో గుడి పడ్వా, ఉగాది, తెలుగు నూతన సంవత్సరం, నవరాత్రి మొదటి రోజు జరుపుకునే పండుగలు.
మహారాష్ట్రలో గుడి పడ్వా, దక్షిణ భారతదేశంలో ఉగాది, తెలుగు నూతన సంవత్సరంగా పిలుస్తారు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ రోజున నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, అలంకరించుకుని, శుభకార్యాలు చేసుకుంటారు.
ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసులు :
బ్యాంకు శాఖలు మూసినా వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎంల వంటి డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆ రోజున చెక్కుల క్లియరింగ్, క్యాష్ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ వంటి కౌంటర్ వద్ద జరిగే లావాదేవీలు మాత్రం అందుబాటులో ఉండవు.
Read Also : Yamaha Tricity 300 : వారెవ్వా.. వరల్డ్ ఫస్ట్ ఎయిర్‌బ్యాగ్ స్కూటర్.. యమహా ట్రైసిటీ 300 లుక్, స్టైల్ సూపర్!
మార్చిలో ఇతర బ్యాంకు సెలవులివే :
మార్చి 19 : గుడి పడ్వా / ఉగాది / తెలుగు నూతన సంవత్సరం / నవరాత్రి మొదటి రోజు
బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్, విజయవాడలలో ఈ రోజు బ్యాంకులు పనిచేయవు.
మార్చి 20 : ఈద్ అల్-ఫితర్, జుమాత్ అల్-విదా :
న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, జైపూర్, లక్నో, పాట్నా, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, అహ్మదాబాద్, భోపాల్, రాంచీ, రాయ్‌పూర్, గౌహతి, తిరువనంతపురం, కొచ్చి సహా అనేక నగరాల్లో ఈ రోజున బ్యాంకులు పనిచేయవు.
మార్చి 21 : రంజాన్ ఈద్ :
అహ్మదాబాద్, భోపాల్, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, రాంచీలలో బ్యాంకులు పనిచేయవు.
మార్చి 22 : ఆదివారం
ఆదివారం రోజున దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలు మూతపడతాయి.
మార్చి 26, 27 : రామ నవమి :
అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, రాంచీ, జైపూర్, లక్నో, కోల్‌కతా నగరాల్లో బ్యాంకులు మూతపడతాయి. డెహ్రాడూన్, లక్నో, గ్యాంగ్‌టక్‌లలో బ్యాంకులు మూతపడతాయి.
31 మార్చి : మహావీర్ జయంతి :
అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీలలో బ్యాంకులు మూతపడతాయి.
మీకు బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందుగా సెలవుల లిస్టు చెక్ చేసుకోండి.
