IRCTC Food Booking : రైల్లో ఆకలేస్తే ఏ యాప్ పడితే ఆ యాప్ వాడొద్దు.. IRCTC బిగ్ వార్నింగ్.. ఫుడ్ ఆర్డర్ చేస్తే జాగ్రత్త..!
IRCTC Food Booking : రైల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? గుర్తింపు లేని యాప్స్, వెబ్సైట్లతో ఆహార భద్రత, డేటా చోరీ, ఆన్లైన్ మోసాల ప్రమాదం ఉందని IRCTC హెచ్చరించింది. సురక్షితంగా ఫుడ్ బుక్ చేసుకునే మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
IRCTC Food Booking
- ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..
- ప్రయాణికులకు IRCTC కీలక హెచ్చరిక
- రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసే ముందు ఇది తెలుసుకోండి..
IRCTC Food Booking : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మీ ఆరోగ్యం జాగ్రత్త.. సాధారణంగా జర్నీలో ఆకలేస్తే చాలామంది వెంటనే మొబైల్ తీసి ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. నచ్చిన హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని మనం దిగాల్సిన స్టేషన్‌కు వచ్చేసరికి వేడివేడి భోజనం అందితే ఆ మజానే వేరు.
అయితే, ఇదే అలవాటు కొన్నిసార్లు ప్రయాణికులను ఇబ్బందుల్లో పడేస్తోందని ఇండియన్ రైల్వే (IRCTC Food Booking) క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) హెచ్చరించింది. ముఖ్యంగా గుర్తింపు లేని వెబ్సైట్లు, మొబైల్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయొద్దని సూచించింది..
ఆకలి కోసం ఆపదలు కొని తెచ్చుకోవద్దు :
రైల్వే ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ పేరుతో అందుబాటులోకి వస్తున్న కొన్ని అనధికారిక ప్లాట్‌ఫామ్స్ వల్ల ఆహార భద్రత, వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలకు ముప్పు పొంచి ఉందని ఐఆర్ సీటీసీ తెలిపింది.
ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో లైసెన్స్ లేని హోటళ్ల నుంచి ఆహారం సరఫరా చేసే అవకాశం ఉందని పేర్కొంది. సరైన పరిశుభ్రత పాటించకపోవడం, శిక్షణ లేని సిబ్బందితో ఆహారం తయారు చేయించడం వల్ల ప్రయాణికుల ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురుకావచ్చని హెచ్చరించింది.
అనాధికారిక ఇ-కేటగిరింగ్ ఆపరేటర్లు :
1 RAILRESTRO.COM
2 RAILRESTRO.IN
3 RAILMITRA.COM
4 TRAVELKHANA.COM
5 TRAINSCAFE.COM
6 DIBRAIL.COM
7 RAILFOOD.NET
8 TRAVELERFOOD.COM
9 FOODONTRACK.IN
10 ECATERING.APP
11 KHANAONLINE.IN
12 TRAINWAY.IN
13 RAILMEAL.COM
14 TRAINMENU.COM
ఇక్కడితో సమస్య అయిపోలేదు.. ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో (PNR) నంబర్, ఫోన్ నంబర్, ఈమెయిల్, బ్యాంకింగ్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని తెలియని యాప్స్‌లో నమోదు చేస్తే ఫిషింగ్, డేటా చోరీ, ఆన్లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ఆర్డర్ పెట్టిన తర్వాత ఫుడ్ క్యాన్సిల్ కావడం, ఆలస్యంగా రావడం, అసలు డెలివరీ కాకపోవడం వంటి సమస్యలు ఎదురైనా సరైన కస్టమర్ సపోర్ట్ దొరకకపోవచ్చని తెలిపింది..
మరి సురక్షితంగా ఫుడ్ ఆర్డర్ చేయాలంటే? :
ప్రయాణికులు ఐఆర్సీటీసీ అధికారిక (e-Catering) వెబ్సైట్, ఫుడ్ ఆన్ ట్రాక్ మొబైల్ యాప్, అధికారికంగా గుర్తింపు పొందిన పార్టనర్ల ద్వారా మాత్రమే ఫుడ్ బుక్ చేసుకోవాలని సూచించింది. అలాగే 1323 హెల్ప్‌లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. రైల్వే స్టేషన్లలో లేదా రైళ్లలో అనధికారికంగా ఆహారం విక్రయిస్తున్నట్లు కనిపిస్తే (RPF) హెల్ప్‌లైన్ 182కు ఫిర్యాదు చేయాలని కోరింది..
ఐఆర్సీటీసీ ఆథరైజడ్ ఫుడ్ అగ్రిగేటర్లు :
1 Zomato
2 Swiggy
3 Zoop
4 Rail yatri
5 Rail recipe
6 Yatribhojan
7 Yatrirestro
8 Garg Rajdhani
9 Homebytes
10 OLF
11 Relfood
12 Gofoodieonline
13 Rajbhog
14 BrotherByte
15 Happy Journey
16 Swad Express
రైల్వే ప్రయాణీకులు ఇలా తమకు ఇష్టమైన ఫుడ్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు..
IRCTC ఇ-క్యాటరింగ్ వెబ్సైట్ : డెస్క్‌టాప్ లేదా మొబైల్ బ్రౌజర్ ద్వారా అధికారిక వెబ్సైట్ (http://www.ecatering.irctc.co.in)ని విజిట్ చేయండి.
ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ : గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి అధికారిక ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
హెల్ప్‌లైన్ 1323 : ఆర్డర్ ఇవ్వడానికి ముందే IRCTC ఇ-క్యాటరింగ్ కస్టమర్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయండి.
అధీకృత పార్టనర్లు : ప్రయాణికులు IRCTC-అధీకృత ఇ-క్యాటరింగ్ పార్టనర్ల ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు.
