Hero HF Deluxe 2026 Flipkart : ఆఫీసులకు వెళ్లేవారికి పర్ఫెక్ట్ బైక్.. రూ.59,999కే హీరో HF డీలక్స్ బైక్ మీ సొంతం.. టాప్ స్పీడ్ 80కి.మీ మైలేజీ..!
Hero HF Deluxe 2026 Flipkart : హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 2026 బైక్ రూ.59,999 ధరతో ఫ్లిప్‌కార్ట్‌లో బుకింగ్‌కు రెడీగా ఉంది. 97.2cc ఇంజిన్, సెల్ఫ్ స్టార్ట్, ఎస్బీఐ, యాక్సస్ బ్యాంక్ ఆఫర్లు, ఫీచర్ల వివరాలివే..
Hero HF Deluxe 2026
- లీటర్ పెట్రోల్‌తో ఎక్కువ మైలేజీ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్..
- తక్కువ ధరలో సెల్ఫ్ స్టార్ట్ బైక్.. హీరో HF డీలక్స్‌పై అదిరిపోయే ఆఫర్లు
- ఫ్లిప్‌కార్ట్‌లో హీరో HF డీలక్స్ 2026 బుకింగ్స్.. SBI కార్డుపై భారీ డిస్కౌంట్
Hero HF Deluxe 2026 Flipkart : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? హీరో బైక్ కొనాలంటే ఇంతకన్నా బెస్ట్ టైమ్ ఉండదు.. రోజూ ఆఫీసులకు వెళ్లేవాళ్లు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు బైక్ కొనాలంటే ముందుగా చూసేది ధర, మైలేజీ, మెయింటెనెన్స్ ఖర్చు. ఎక్కువ డబ్బులు పెట్టకుండా రోజువారీ అవసరాలకు ఉపయోగపడే బైక్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే..
అయితే, హీరో మోటోకార్ప్ హెచ్ఎఫ్ డీలక్స్ 2026 మోడల్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. తక్కువ ధరలో లభించే ఈ బైక్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బుకింగ్‌కు అందుబాటులో ఉంది.. ఇంతకీ ఈ బైక్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ధర ఎంతంటే? :
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ నాన్-i3S సెల్ఫ్ 2026 మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.59,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.4,898 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.4,423 వరకు తగ్గింపు ప్రకటించారు. ఈఎంఐ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది. అయితే, ఆన్లైన్లో చూపించే ఆఫర్లు, బ్యాంక్ నిబంధనలను బట్టి మారవచ్చు. ఆర్టీఓ, ఇన్సూరెన్స్ ఛార్జీలు అదనంగా చెల్లించాలి..
Read Also : Apple iPhone 18 : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 18లో భారీ అప్గ్రేడ్లు.. ఐఫోన్ 18eతో పాటు లాంచ్‌కు రెడీ?
ఇంజిన్, పర్ఫార్మెన్స్ ఇలా :
ఈ బైక్‌లో 97.2cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. 7.91bhp టాప్ పవర్, 8.05Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, 4-స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు. సెల్ఫ్ స్టార్ట్ సదుపాయం ఉంది. రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు మైలేజీ అందిస్తుంది.
ఇతర ఫీచర్లు ఇవే :
ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండు వైపులా డ్రమ్ బ్రేకులు, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు. అల్లాయ్ వీల్స్, ట్యూబ్ టైర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు..
మొత్తంగా తక్కువ బడ్జెట్లో రోజువారీ ప్రయాణాల కోసం బైక్ కొనాలనుకునేవారికి హెచ్ఎఫ్ డీలక్స్ అద్భుతమైన ఆప్షన్.. కొనుగోలు చేసే ముందు మైలేజీ, ఆన్-రోడ్ ధర, లోకల్ డీలర్ ఆఫర్లను తెలుసుకోవడం బెటర్..
