Pinnelli Ramakrishna Reddy : మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట.. 98 రోజుల తర్వాత బెయిల్ మంజూరు
Pinnelli Ramakrishna Reddy : వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి భారీ ఊరట లభించింది.
gurazala court granted bail for former mla pinnelli ramakrishna reddy
Pinnelli Ramakrishna Reddy : వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన గత 98 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. తాజాగా గురజాల 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి బుధవారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. కేసు విచారణకు సహకరించాలని, సాక్ష్యాధారాలను ప్రభావితం చేయకూడదని, అవసరమైనప్పుడు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు.
మాచర్ల నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ జంట హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వీరిపై కేసు నమోదు చేశారు. అనంతరం పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత వారు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా గురజాల కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేయగా.. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి మాత్రం బెయిల్ నిరాకరించింది. త్వరలోనే పిన్నెల్లి జైలు నుంచి బయటకు రానున్నారు.
