Vehicle Tracking : ‘ఒక్క బటన్.. చాలు’.. వాహనం ఎక్కడున్నా క్షణాల్లో కనిపెట్టే సేఫ్టీ ట్రాకర్!
Vehicle Tracking : వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ మీ వాహనం ఎక్కడ ఉందో ఇట్టే చెప్పేస్తుంది. ఎలాంటి ప్రమాదం జరిగినా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ఈజీగా సమాచారం అందిస్తుంది.. ఇదేలా పనిచేస్తుందంటే?
Vehicle Tracking Technology
- మీ వాహనం ఎక్కడుందో క్షణాల్లో చెబుతుంది
- ప్రమాద వేళ ప్రాణాలను కాపాడే డిజిటల్ కవచం
- వీల్టీడీతో భద్రతకు కొత్త భరోసా
- ఎమర్జెన్సీ బటన్ నొక్కితే అధికారులకు అలర్ట్
Vehicle Tracking : మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? వాహనంలో ఏదైనా ఇబ్బంది ఎదురైందా? డోంట్ వర్రీ.. మీ వెహికల్ ఎక్కడుంది? ఏయే మార్గంలో వెళ్తోంది? అనే పూర్తి సమాచారం ఇక క్షణాల్లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అత్యాధునిక సాంకేతిక రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
అదే.. వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (VLTD) ప్రయాణ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా వెళ్లినా లేదా వాహనం ప్రమాదానికి గురి కావడం జరిగానా ఏదైనా ఎమర్జెన్సీ ఎదురైనా సరే మీ వాహనంలో అమర్చిన వీఎల్టీడీ ట్రాకర్‌పై కనిపించే చిన్న బటన్ ట్యాప్ చేస్తే చాలు.
వెంటనే పోలీసులు, రవాణాశాఖ అధికారులు, ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బందికి సమాచారం అందుతుంది. మీ వాహనం ఉన్న ప్రాంతాన్ని జీపీఎస్ ద్వారా వెంటనే గుర్తించి సహాయక చర్యలు చేపడుతారు.
ఒక్క బటన్‌తో మీ చెంతకు :
వీఎల్టీడీ డివైజ్ వెహికల్ ఇంజిన్ భాగంలో అమర్చుతారు. జీపీఎస్ టెక్నాలజీ ఆధారంగా రన్ అవుతుంది. ప్రయాణికులు కూర్చునే ప్రాంతంలో లింక్ చేసి ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. ఏదైనా అనుకోని ప్రమాదం, అనారోగ్య సమస్య లేదంటే భద్రతాపరమైన ఇబ్బంది ఎదురైతే ఆ బటన్ నొక్కితే చాలు.. వాహనం ప్రస్తుత లొకేషన్, ఎక్కడ ఉంది? అనే పూర్తి వివరాలు అధికారులకు అందుతాయి. తద్వారా వేగంగా స్పందించడమే కాకుండా అవసరమైన సాయం కూడా వెంటనే అందుతుంది.
Read Also : Swiggy-Zomato : స్విగ్గీ, జొమాటోకు CMC అల్టిమేటం.. లైసెన్స్ లేని ఫుడ్ అవుట్లెట్లకు ‘నో ఎంట్రీ’!
ప్రజా, సరకు రవాణా వాహనాలకు మస్ట్ :
ప్రయాణికుల కోసం రెంట్ కార్లు, జీపులు, విద్యాసంస్థల బస్సులు, ట్రావెల్స్ బస్సులు, నేషనల్ పర్మిట్ సరకు రవాణా లారీలు వంటి వాణిజ్య వాహనాలకు కూడా వీఎల్టీడీ తప్పనిసరి. 2019 జనవరి 1 నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది.
కొత్త వాహనాల్లో తయారీ దశలోనే ఈ డివైజ్‌లను అమర్చుతున్నారు. అయితే, కొంతమంది వాహనదారులు ఈ డివైజ్ లేకుండా వాడుతున్నట్టు గుర్తించారు. ఇకపై డివైజ్ యాక్టివ్‌గా ఉండాల్సిందే. 2019కి ముందు రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలు కూడా వీఎల్టీడీని అమర్చుకోవడం తప్పనిసరి.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో నిఘా :
వీఎల్టీడీ అమర్చిన వాహనాల మూవింగ్స్ మానిటరింగ్ చేసేందుకు రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా వెహికల్ ఎక్కడ ఉంది? ఏ దిశలో వెళ్తోంది? అనే వివరాలను కూడా రియల్‌టైమ్‌లో తెలుసుకోవచ్చు. ప్రమాదాలు జరిగినా బాధితుల వద్దకు వేగంగా చేరుకోవచ్చు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు అందించవచ్చు. అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి అంశాల్లో కూడా ఈ సిస్టమ్ అద్భుతంగా ఉంటుంది.
చిన్నారులు, మహిళలకు ఫుల్ సేఫ్టీ :
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో చిన్నారులు, మహిళల భద్రతకు ఈ సిస్టమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణ సమయాల్లో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే అధికారులకు సమాచారం అందుతుంది. తద్వారా ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే వెహికల్లో ఎవరికైనా తీవ్ర అనారోగ్య పరిస్థితి ఎదురైనా వాహనం ఉన్న ప్రాంతాన్ని ఈజీగా గుర్తించి అంబులెన్స్ వంటి సర్వీసులను వేగంగా పొందవచ్చు.
టెక్నాలజీ సేఫ్టీ జర్నీ :
ఇన్నాళ్లూ వెహికల్ ఎక్కడుందో కనిపెట్టడం చాలా కష్టంగా ఉండేది. ఇకపై అలా ఉండదు. వీఎల్టీడీతో వాహనాలపై ఈజీగా మానిటరింగ్ చేయొచ్చు. ట్రావెలింగ్ సేఫ్టీ పెంచడమే కాదు.. అత్యవసర సమయాల్లో కూడా ప్రాణాలను కాపాడే టెక్నికల్ ప్రొటెక్షన్ షీల్డ్‌గా మారుతుంది.
