Telangana Tiger Car : ‘తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి’ పేరుతో కారు హల్చల్.. ఫొటో వైరల్!
Telangana Tiger Car : దిల్‌సుఖ్‌నగర్‌లో నంబర్ ప్లేట్ స్థానంలో రేవంత్ రెడ్డి టైగర్ పేరుతో ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ప్రజలను ఓ కారు భయబ్రాంతులకు గురి చేసింది. నంబర్ ప్లేట్ లేకుండా కారు తిరుగుతుంటే ట్రాఫిక్ పోలీసులు ఎలా అనుమతిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Telangana Tiger Car
- తెలంగాణ టైగర్ పేరుతో దిల్‌సుఖ్‌నగర్‌లో కారు కలకలం
- నంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట రేవంత్ రెడ్డి పేరు
- రోడ్లపై ఎలా అనుమతించారంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్లు
Telangana Tiger Car : హైదరాబాద్ నగర రోడ్లపై ఓ కారు హల్చల్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. నంబర్ ప్లేట్ లేకుండా ఓ కారు నగర వీధుల్లో దూసుకుపోతోంది. అది కూడా దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో కనిపించింది. పైగా ఆ కారు వెనుక నంబర్ ప్లేట్ లేదు.. సాధారణంగా రోడ్డుపై తిరిగే ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ తప్పనిసరి.
కానీ, ఈ కారు మాత్రం భిన్నంగా కనిపించింది. వెనుక గ్లాస్‌పై ప్రత్యేక గుర్తులు ఉన్నాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ‘తెలంగాణ టైగర్’ అనే పేరు కూడా ఉంది. నంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట రేవంత్ రెడ్డి అని రాసి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్ని వాహనాల్లో కనిపించే రిజిస్ట్రేషన్ నంబర్ స్థానంలో ఇలా పేరు రాసి ఉండటంతో ఈ కారు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోడ్డుపై ఈ కారును చూసిన పలువురు తమ ఫోన్లలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోను చూసి నెటిజన్లు వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘నిబంధనలు సామాన్యులకేనా?’, ‘నంబర్ ప్లేట్ లేకుండా వాహనం ఎలా తిరుగుతోంది?’, ‘ట్రాఫిక్ అధికారులు దీనిని గమనించలేదా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో నంబర్ ప్లేట్ స్థానంలో రేవంత్ రెడ్డి టైగర్ పేరు వేసుకొని ఓవర్ స్పీడ్‌గా ఓ కారు వెళ్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోందని అంటున్నారు. నంబర్ ప్లేట్ లేకుండా కారు తిరుగుతుంటే ట్రాఫిక్ పోలీసులు ఎలా అనుమతిస్తున్నారంటూ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇంతకీ ఈ కారు ఎవరిది? ఇందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఎవరు? నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించేందుకు ఏదైనా కారణం ఉందా? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ వర్గాల్లో ఈ కారు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి..
